- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > పల్లెల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది : ఎమ్మెల్యే సుంకే
పల్లెల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది : ఎమ్మెల్యే సుంకే
X
దిశ, రామడుగు : పల్లెల అభివృద్ధే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. రామడుగు మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో 44 లక్షల రూపాయలతో మున్నూరుకాపు, అంబేద్కర్ సంఘం, కుమ్మరి సంఘం, మహిళా సంఘం, సీసీ రోడ్లు నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి కొరకు ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుందని అన్నారు.
అలాగే పల్లెలు పచ్చదనంతో ఉండేందుకు హరితహారం కార్యక్రమం పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసిందన్నారు. అంతేకాకుండా నూతనంగా ఏర్పడిన గ్రామాలకు గ్రామపంచాయతీ భవనాలను మంజూరు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ బక్క శెట్టి నరసయ్య, రామడుగు మండల బీఆర్ఎస్ అధ్యక్షులు గట్ల జితేందర్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Next Story