- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ స్కీం కు అర్హులైన చిన్నారులకు ప్రతినెల రూ. 4000..
దిశ, కరీంనగర్ టౌన్ : తల్లి, తండ్రి లేని చిన్నారులు, ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద కుటుంబానికి చెంది, నిస్సహాయస్థితిలో ఉన్న చిన్నారులకు ఆర్థికంగా సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్య పథకం తీసుకువచ్చిందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర అన్నారు. 0 నుండి 18 సంవత్సరాల వయసు మధ్య గల పిల్లలకు వైద్య, విద్య అభివృద్ధి అవసరాలు తీర్చడానికి కూడా ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. కాగా ఈ పథకం ద్వారా అర్హులైన చిన్నారులకు నెలకు 4000 రూపాయలు స్కాలర్షిప్ ద్వారా అందించనున్నారని, అర్హులైన చిన్నారులకు ఈ పథకం వరం లాంటిదని పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ ఈ పథకం కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని, ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లల వరకు ధరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నిరుపేద నిస్సహాయ స్థితిలో ఉండి, 18 సంవత్సరాల వయస్సులోపు పిల్లలు అర్హులన్నారు. ముఖ్యంగా వితంతువు, ఒంటరి మహిళల పిల్లలు, అనాథ పిల్లలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
తల్లి , తండ్రి ఆధార్ కార్డు...
తల్లి లేదా తండ్రి మరణ ధ్రువీకరణ పత్రము, మరణకారణము, గార్డియన్ ఆధార్ కార్డు, రేషన్ కార్డ్ లేదా రైస్ కార్డు, బాలుడి లేదా బాలిక పాస్ ఫోటోస్టడీ సర్టిఫికేట్, ఆదాయ ధ్రువీకరణ పత్రము, బాలుడి లేదా బాలిక వ్యక్తిగత బ్యాంక్ ఎకౌంటు లేదా తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకులతో కలిసిన జాయింట్ అకౌంట్ వివరాలతో మిషన్ వాత్సల్య పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అనాధలు, తండ్రులను కోల్పోయి ఆలనా పాలన లేని అభాగ్యుల ఆధాయధృవీకరణ పత్రాల జారీలో రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురి చేయకుండా, ఉదారత చూపాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.