- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంగమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకున్న కేటీఆర్
దిశ, సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. మంగళవారం జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మొదటగా గంభీరావుపేట మండల కేంద్రంలో రూ.50 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించనున్న అంబేద్కర్ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, రూ.25 లక్షల ఈజీఎస్ నిధులతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లు, రూ.20 లక్షల సీడీపీ నిధులతో గ్రంథాలయం, రూ.7 కోట్ల 50 లక్షలతో మల్లారెడ్డిపేట నుండి గంభీరావుపేట రోడ్డుపై నిర్మించనున్న హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గంగమ్మ జాతర సందర్భంగా గంగా భవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.