కాళేశ్వరం పై జ్యుడీషియల్ ఎంక్వయిరీ జరిపించాలి.. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబు

by Sumithra |
కాళేశ్వరం పై జ్యుడీషియల్ ఎంక్వయిరీ జరిపించాలి.. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబు
X

దిశ, మంథని : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం నిర్మాణంలో లోపాల పై జ్యుడీషియల్ ఎంక్వయిరీ జరిపించాలని కాంగ్రెస్ మేనిఫెస్టో చైర్మన్, ఎఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, నాణ్యత లోపాలకు కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉందని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం కన్నాల వెంకటేశ్వర, మంథని మహాలక్ష్మి ఆలయాల్లో ప్రత్యేక పూజల అనంతరం శ్రీధర్ బాబు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో శనివారం సాదాసీదాగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రీ డిజైనింగ్ వద్దని, రివర్స్ పంపింగ్ పనికిరాదని తాము మొదట్లోనే చెప్పామన్నారు.

ప్రాజెక్టు ప్లానింగ్ డిజైన్లలో లోపాల గురించి డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం తమ నివేదికలో వెల్లడించారని అన్నారు. బ్యారేజ్ ని మళ్లీ నిర్మించాల్సి ఉందని చెప్పారని గుర్తు చేశారు. డిజైనింగ్ లో లోపాలు, నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇదంతా జరిగినట్లు తేలిపోయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మంథని ప్రాంతాల్లో ఒక్క ఎకరాకు నీరు అందలేదని, ప్రజాధనం నీళ్లపాలవగా కాంట్రాక్టర్లకు లబ్ధి జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మొదట్లోనే నాణ్యత ప్రమాణాల పై శ్రద్ధ చూపి ఉంటే ఈరోజు ఇలా జరిగేది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం మిగతా విషయాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సహకారం అందించినా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రజల పక్షాననిలబడతారని ఆశిస్తున్నామన్నారు. బ్యారేజీలను పరిశీలించిన తర్వాత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందన ఎలా ఉంటుందో చూడాల్సి ఉందన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాయడం ఖాయమని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. 70 - 75 స్థానాలు గెలవనున్నామన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ న నియంత పాలన పై విసిగెత్తి కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలను మేనిఫెస్టో రూపొందించామన్నారు. మహిళలు, రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, కూలీల సమస్యల పరిష్కారంలో పాలుపంచుకునేలా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఆర్ గ్యారంటీల పై ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తుందన్నారు. మంథనిలో తన గెలుపు ఖాయమన్నారు.'కార్యకర్తలు నాయకుల బలంతో పాటు ప్రజల ఆశీర్వాదం ఉంటుందన్నారు. గడిచిన ఐదేళ్లలో ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజల సమస్యల పై అసెంబ్లీలో తన గళం వినిపించానన్నారు. అధికారంలో ఉండి అవగాహన లేని వారు ప్రతిపక్షంలో ఉన్న తమ పై నిందలు వేయడం శోచనీయమన్నారు. చిన్న కాళేశ్వరం విషయంలో పదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం పట్టించుకోకుండా రైతులకు అన్యాయం చేసిందన్నారు.

Advertisement

Next Story