తెలిసిన వ్యక్తి అని లిఫ్ట్ ఇచ్చిన రైతు.. తర్వాత ఏమైందంటే..

by Disha News Desk |
తెలిసిన వ్యక్తి అని లిఫ్ట్ ఇచ్చిన రైతు.. తర్వాత ఏమైందంటే..
X

దిశ, పెద్డపల్లి: మూలసాల గ్రామంలో వింత ఘటన చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా మూలసాల గ్రామ రైతు దాసరి కొమురయ్య పొలం పనులు ముగించుకొని తన ద్విచక్ర వాహనంపై గడ్డిమోపు పెట్టుకొని ఇంటికి వస్తున్న క్రమంలో, ఇంటి పక్కనే ఉండే ఎర్రం సాయి కృష్ణ మార్గమధ్యంలో కలిసి తను కూడా ఇంటికి వస్తానని, లిఫ్ట్ కావాలా అని అడిగాడు. దాంతో తెలిసిన వ్యక్తే కదా అని కొమురయ్య లిఫ్ట్ ఇచ్చాడు. కాసేపటికి సాయి కృష్ణ వద్ద ఉన్న కత్తితో కొమురయ్యపై దాడికి పాల్పడ్డాడు. కొమురయ్య వీపు, నడుము భాగంలో బలంగా పొడిచి పరారయ్యాడు. దాసరి కొమురయ్యను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాయి కృష్ణ కోసం గాలిస్తున్నారు.

Advertisement

Next Story