- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్కసారి అవకాశం ఇస్తే రామగుండాన్ని అభివృద్ధి చేస్తా.. మక్కాన్సింగ్
దిశ, గోదావరిఖని : రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం కల్పిస్తే ఈ ప్రాంతాన్ని స్మార్ట్ సిటీగా మారుస్తానని, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి మక్కన్ సింగ్ అన్నారు. శనివారం గోదావరిఖనిలోని జవహర్ లాల్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ సభలో మక్కాన్సింగ్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం కల్పిస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తూ, రామగుండంని స్మార్ట్ సిటీగా చేస్తానని అన్నారు. అంతేకాకుండా సింగరేణి కార్మికులకు సొంతింటి కలలను నెరవేరుస్తానని, ప్రతి సింగరేణి కార్మికునికి ఇల్లు కట్టిస్తామని అన్నారు. యువతకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనిపిస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు, ఒంటరి మహిళలకు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి వారికి అండదండగా ఉంటానని అన్నారు.
సింగరేణి కాంటాక్ట్ లో పనిచేస్తున్న కార్మికులకు పర్మినెంట్ చేస్తానని, ఆర్ఎఫ్సీఎల్, ఎన్టీపీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. సింగరేణి ప్రాంతాన్ని బొందల గడ్డగా మారుస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులను అనారోగ్యాలకు గురి చేస్తున్నారని అన్నారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్ సీఎల్, కార్మికుల కోసం ఈఎస్ఐ హాస్పిటల్ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని శాలువాతో, గజమాలతో సత్కరించారు. అనంతరం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పావురాలను, బెలూన్స్ లు ఆకాశంలోకి వదిలారు. ఈ బహిరంగ సభలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, జనప్రసాద్, పాతిపల్లి ఎల్లయ్య,బొంతల రాజేష్, మహంకాళి స్వామి, కాల్వ లింగస్వామి, మాదరబోయిన రవికుమార్, పాతిపల్లి రవి, తిప్పారం శ్రీనివాస్, బొమ్మక రాజేష్ సింహాచలం, పెద్దెల్లి ప్రకాష్, ముస్తఫా, ఆడెపు రవి, పాతిపల్లి మల్లయ్య , హనుమ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.