- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Liquor destroyed : ధర్మపురిలో 6 లక్షల విలువైన మద్యం ధ్వంసం..
దిశ, వెల్గటూర్ : ధర్మపురి నియోజకవర్గంలో గత కొంతకాలంగా పోలీసులు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నమోదైన వివిధ కేసుల్లో పట్టుబడిన 6 లక్షల విలువగల అక్రమ మద్యంను శనివారం పోలీసు ఎక్సైజ్ శాఖల అధికారుల ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. ధర్మపురి నియోజకవర్గంలో గత కొంత కాలంగా పోలీసులు, ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో ధర్మపురి , వెల్గటూర్, గొల్లపల్లి మండలాల్లో 117 అక్రమ మద్యం రవాణా కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో సుమారుగా 6 లక్షల విలువైన నాటుసారా, గుడుంబా, బీర్లు, లిక్కర్ పట్టుబడింది. కోర్టు ఆదేశాల మేరకు జగిత్యాల డీఎస్పీ రఘుచండర్ ఆధ్వర్యంలో ధర్మపురి సీఐ రాం నర్సింహారెడ్డి, ఎక్సైజ్ మహేందర్ సింగ్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి పట్టుబడిన మద్యం విలువను అంచనా వేయగా రూ.6 లక్షల విలువగల మద్యం పట్టుబడినట్లు పోలీసులు గుర్తించారు.
అనంతరం డీఎస్పీ రఘు చందర్ ఆధ్వర్యంలో పోలీసు ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుబడిన మద్యంను రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. లక్షల విలువైన మద్యం సీసాలను రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేస్తుంటే రోడ్డు రోలర్ కింద పడి పగులుతున్న సీసాల శబ్దం విని ఆ చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనిస్తూ ఉన్న మందుబాబుల గుండెలు అవిసిపోయాయి. విలువైన మద్యం ఉత్తపుణ్యానికి నేల పాలవుతుంటే తట్టు కోలేని తాగుబోతుల నాలుక తడారిపోయి తల్లడిల్లటం విశేషం. ఈ కార్యక్రమంలో సీఐలు రామ్ నరసింహారెడ్డి, మహేందర్ సింగ్, ఎస్సైలు ఉమా సాగర్, ఉదయ్ కుమార్ పోలీసు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.