Laws of Women : ప్రతి మహిళకు చట్టాల పై అవగాహన ఉండాలి..

by Sumithra |
Laws of Women : ప్రతి మహిళకు చట్టాల పై అవగాహన ఉండాలి..
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : ప్రతి మహిళకు రాజ్యాంగం కల్పించిన హక్కుల పై అవగాహన ఉండాలని సఖీ కేంద్రాల నిర్వాహకురాలు పద్మ సూచించారు. శనివారం వేములవాడ పట్టణంలోని భగవంతురావు నగర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు, కోనారావుపేట మండలం నాగారం జీఎంఆర్ వరలక్ష్మి ఉపాధి శిక్షణా కేంద్రంలో కుట్టు మిషన్ శిక్షణ పొందుతున్న మహిళలకు, యువతులకు సఖీ కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ మహిళలకు రాజ్యాంగం కల్పించిన చట్టాలు, నూతనంగా అమల్లోకి వచ్చిన చట్టాల గురించి వివరించారు.

గృహహింస, వరకట్న వేధింపులు, లైంగిక దాడులు అక్రమ రవాణా, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, వంటి హింసలకు గురవుతున్న మహిళలకి సఖి కేంద్రం ద్వారా అందిస్తున్న వైద్య, న్యాయ, కౌన్సిలింగ్, పోలీస్, తాత్కాలిక నివాసం ఐదు రకాల సేవలు ఉచితంగా 24 గంటలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అలాగే మహిళా హెల్ప్ లైన్ 181, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, హెల్ప్ లైన్ నెంబర్ల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో శిక్షణా కేంద్రం ప్రిన్సిపల్ మహేష్, డీ-హబ్ జెండర్ స్పెషలిస్ట్ దేవిక, డి-హబ్ సిబ్బంది, మహిళలు, యువతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed