- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ఎఫెక్ట్.. అక్రమ ఇసుకకు కళ్లెం
by S Gopi |
X
దిశ, ముస్తాబాద్: మండలంలో అక్రమ ఇసుక జోరుగా సాగుతోంది. రాత్రి పగలు అని తేడా లేకుండా అడ్డదారుల్లో అడ్డగోలుగా ట్రిప్ ల కొద్దీ ఇసుక జిల్లా సరిహద్దులు దాటుతున్న విషయం దిశ దిన పత్రికలో వరుస కథనాలు రావడంతో రెవెన్యూ, పోలీస్ అధికారుల్లో చలనం కలిగింది. "సరిహద్దులు దాటుతున్న సహజ సంపద, రెచ్చిపోతున్న ఇసుక మాఫియా" అనే శీర్షికతో వరుసగా ప్రచురితం కావడంతో ఇసుకాసురుల గుండెల్లో గుబులు రేపింది. ఎస్సై వెంకటేశ్వర్ మరుదినం నుండే పహారా కాస్తూ ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నారు. 10 రోజుల్లో అక్రమంగా తరలిస్తున్న 6 ట్రాక్టర్లను పట్టుకుని స్టేషన్ కి తరలించి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మండలంలో ఇసుకను అక్రమంగా తరలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎమ్మార్వో కూడా అక్రమ ఇసుకపై కఠిన ఆంక్షలు విధిస్తూ ఇసుకను పొరుగు జిల్లాలకు వెళ్లకుండా అడ్డుకట్ట వేస్తున్నారు.
Advertisement
Next Story