- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శాంతిభద్రతల పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యం.. మంత్రి కేటీఆర్
దిశ, కరీంనగర్ బ్యూరో : తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం శాంతి భద్రతలకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కేటీఆర్ పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. తంగాలపల్లి మండలం జిల్లెల చెక్ పోస్ట్ నుండి సిరిసిల్ల, అగ్రహారం, నంది కమాన్, వెంట్రావుపల్లి బార్డర్ వరకు ప్రధాన రహదారి వెంట సింగరేణి వారి సహకారంతో ఏర్పాటు చేసిన 80 సీసీటీవీ కెమెరాలను మంత్రి ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. జిల్లాలోని జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను, సిరిసిల్ల పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ కెమెరాలు, పోలీస్ కార్యాలయంలోని తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ద్వార కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దేశంలోనే అత్యుత్తమ పోలీసింగ్ సేవలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ లో కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఏ మూలన ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా కనిపెట్టే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. పోలీసుల ఆత్మగౌరవం పెరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తున్నది అన్నారు. ప్రజల ధన మాన ప్రాణ రక్షణనే ధ్యేయంగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని. రాష్ట్రంలో పటిష్ట శాంతిభద్రతల కారణంగా రాష్ట్రానికి కొత్త పెట్టుబడులతో పాటు, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని మంత్రి తెలిపారు.
జిల్లాలో నేరాల నియంత్రణ కోసం వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, సిరిసిల్ల పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ కెమెరాలు, నూతనంగా సింగరేణి వారి సహకారంతో తంగాలపల్లి మండలం జిల్లెల చెక్ పోస్ట్ నుండి సిరిసిల్ల, అగ్రహారం, నంది కామన్, వెంకట్రావుపల్లి బార్డర్ వరకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేశామని తెలిపారు. కమాండ్ కంట్రోల్ ద్వారా జిల్లాలో ఎలాంటి సంఘటనలు జరిగినా సీసీ కెమెరాల ద్వారా గుర్తించవచ్చునని మంత్రి అన్నారు. మంత్రి వెంట జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, టెక్స్ టైల్, పవర్ లూమ్ కార్పొరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్, టెస్క్యాబ్ చైర్మన్ కొండూరు రవీందర్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, మున్సిపల్ చైర్మన్ జింధం కళ తదితరులు ఉన్నారు.