- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్సీ పదవికి కవిత బేషరతుగా రాజీనామా చేయాలి: బీజేపీ నాయకుల డిమాండ్
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: ఎమ్మెల్సీ పదవికి కవిత బేషరతుగా రాజీనామా చేయాలని కొరుతూ ఎల్లారెడ్డిపేట భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి కవిత, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ అడ్డంగా దొరికిన ఎమ్మెల్సీ కవిత తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిందన్నారు.
కవిత తన ఎమ్మెల్సీ పదవికి బేషరతుగా రాజీనామా చేసి తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్కామ్ లో దొరికిపోయిన తన బిడ్డను సీఎం ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందుల గురి చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులను తరిమికొట్టే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను బయట పెట్టేదాకా భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మద్దుల బుగ్గారెడ్డి, బొమ్మాటి స్వామి, రేపాక రామచంద్రారెడ్డి, మేడిశెట్టి బాలయ్య, దాసరి గణేష్, జితేందర్ రెడ్డి, శీను, వంగల రాజు, రవి, దుస్స శ్రీనివాసు, రవి నాయక్, పిట్ల శ్రీశైలం, భాస్కర్, లక్ష్మణ్, సనత్, ప్రశాంత్ కిషోర్, రవి, దయాకర్, కొండాపురం సత్తిరెడ్డి, గెంటే రవి, అరవింద్, రవీందర్, రాకేష్, ప్రశాంత్, కమ్మరి ఆంజనేయులు, సాగర్, కిట్టు, పరశురాం రెడ్డి, రాకేష్ , సంతోష్, మహేష్, తదితరులు పాల్గొన్నారు