కవులు, కళాకారులకు పుట్టినిల్లు కరీంనగర్: ఎంపీ బండి సంజయ్

by Shiva |
కవులు, కళాకారులకు పుట్టినిల్లు కరీంనగర్: ఎంపీ బండి సంజయ్
X

దిశ, కరీంనగర్: కవులు, కళాకారులకు పుట్టినిల్లు కరీంనగర్ అని ఎంపీ బండి సంజయ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జ్యోతిరావు పూలే పార్క్ లో కొనసాగుతున్న కరీంనగర్ పుస్తక మహోత్సవం 3వ రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అన్ని స్టాళ్లను సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కవులు, కళాకారులు, ప్రముఖులను అందించిన జిల్లా కరీంనగర్ అని అన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిన ఘనత పుస్తకానికే దక్కుతోందన్నారు.

ప్రపంచంలో పుస్తకానికి ఉన్న విలువ దేనికి ఉండదన్నారు. పుస్తకాలను కొనడం, చదవడం మాత్రమే కాదు అందులో జ్ఞానాన్ని నలుగురికి పంచేలా అందరూ కృషి చేయాలన్నారు. ప్రస్తుతం విద్యార్థులకు ఆన్ లైన్, సామాజిక మాద్యమాలతో కూడిన విద్యను అలవాటు చేయడం వల్ల వారిలో అలోచనా పటిమను కొల్పోతున్నారని తెలిపారు. పిల్లలకు పుస్తకాలను దగ్గర చేసి చదువు చెప్పడం వల్ల వారు స్వశక్తితో అలోచించి విజ్ఞానవంతులుగా వెలుగొందుతారని ఆయన తెలిపారు. మనకు తెలియని ఎన్నో విషయాలను పుస్తకం మనకు పరిచయం చేస్తుందని, చరిత్రను కనుమరుగు కాకుండా కాపాడేది ఒక్క పుస్తకమేనని ఆయన పేర్కొన్నారు.

అనంతరం కలెక్టర్ ఆర్.వీ.కర్ణన్ మాట్లాడుతూ జిల్లాలో రెండో దఫా నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మార్చి 2న మంత్రి చేతుల మీదుగా ప్రారంభించిన పుస్తక ప్రదర్శన 8 వరకు కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రయంలో భాగంగా ప్రతిరోజూ ఉదయం విద్యార్థులకు పుస్తకాల పరిచయ కార్యక్రమం, సాయంత్రం జిల్లాకు చెందిన కవులు, కళాకారుల సన్మానించే కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ప్రియాంక, ట్రైనీ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, కార్పొరేటర్ చోప్పరి జయశ్రీ, డీడబ్ల్యూవో సబితా కుమారి, మార్కెటింగ్ అధికారి పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed