ఆ స్థలాలు ఇచ్చేది లేదు.. జర్నలిస్ట్‌లకు తేల్చి చెప్పిన కలెక్టర్

by karthikeya |   ( Updated:2024-10-08 15:44:03.0  )
ఆ స్థలాలు ఇచ్చేది లేదు.. జర్నలిస్ట్‌లకు తేల్చి చెప్పిన కలెక్టర్
X

గత ప్రభుత్వం ఏడాది కింద ఎన్నికల నోటీఫికేషన్‌కు ఒకరోజు ముందు జర్నలిస్టులకు పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలను కలెక్టర్ రద్దు చేయడం చర్చనీయంగా మారింది. ఆ పట్టాల పంపిణీలో అవకతవకలు జరిగాయని కొంతమంది జర్నలిస్టులు నాడు ఆందోళనకు దిగడంతో ఉత్కంఠకు తెరలేసింది. కాగా, సరిగ్గా ఏడాదికి ఆ ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు ఆ పట్టాలు రద్దు అయ్యాయని అధికారులు తేల్చి చెప్పారు. కాగా పట్టాల పొందిన వారిలో ఆ నాటి మంత్రి అనుచరులు, జర్నలిస్టు వృత్తితో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు, నాటి నాయకుల వ్యక్తిగత సిబ్బంది ఉండడం జర్నలిస్టు వర్గాల్లో అసంతృప్తికి ఆజ్యం పోసింది. దీంతో కొంతమంది జర్నలిస్టులు కోర్టును ఆశ్రయించడంతో పరిశీలించిన న్యాయస్థానం సైతం స్టే ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పట్టాలు పొందిన కొంతమంది జర్నలిస్టులు ఆందోళన బాట పట్టడం ఒకింత ఆశ్చర్యం కలిగించింది. కాగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన గత పాలకులు జర్నలిస్టుల జీవితాలతో చెలగాటం ఆడడం ఆందోళన కలిగిస్తోంది.

దిశ బ్యూరో, కరీంనగర్: గత ప్రభుత్వం ఏడాది కింద ఎన్నికల నోటీఫికేషన్‌కు ఒకరోజు ముందు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేసింది. కాగా, ఆ పట్టాల పంపిణీలో అవకతవకలు జరిగాయని కొంతమంది జర్నలిస్టులు ఆందోళనకు దిగడంతో ఉత్కంఠకు తెరలేసింది. కాగా, సరిగ్గా ఏడాదికి ఆ ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు ఆ పట్టాలు రద్దు అయ్యాయని అధికారులు తేల్చి చెప్పారు. కాగా పట్టాల పొందిన వారిలో ఆ నాటి మంత్రి అనుచరులు, జర్నలిస్టు వృత్తితో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు, నాటి నాయకుల వ్యక్తిగత సిబ్బంది ఉండడం జర్నలిస్టు వర్గాల్లో అసంతృప్తికి ఆజ్యం పోసింది. దీంతో కొంతమంది జర్నలిస్టులు కోర్టును ఆశ్రయించడంతో పరిశీలించిన న్యాయస్థానం సైతం స్టే ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పట్టాలు పొందిన కొంతమంది జర్నలిస్టులు ఆందోళన బాట పట్టడం ఒకింత ఆశ్చర్యం కలిగించింది. కాగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన గత పాలకులు జర్నలిస్టుల జీవితాలతో చెలగాటం ఆడడం ఆందోళన కలిగిస్తోంది.

ఊరించి ఉసురు పోసుకున్న మాజీ మంత్రి

జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇస్తున్మానంటూ గతంలో ఐదేళ్లు కాలయాపన చేసిన మాజీ మంత్రి ఇచ్చిన పట్టాల్లో చట్టబద్ధత లేకపోవడం జర్నలిస్టులకు ఆశ భంగం కలిగింది. డబుల్ బెడ్ రూం పట్టాల పేరుతో ఇండ్ల నిర్మాణం లేకుండా, కనీసం ఆ స్థలానికి సంబంధితశాఖ నుంచి ఎటువంటి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ సైతం తీసుకోకుండా నాడు హడావిడి చేశారు. కానీ సంవత్సరకాలం పాటు ఆశతో ఉన్న జర్నలిస్టులకు ఎట్టకేలకు నిరాశే మిగిలి చివరకు పట్టాల రద్దు ప్రకటన ఆయా వర్గాల్లో ఆందోళన కలిగించింది.

పట్టాల రద్దుకు అక్రమాలే అసలు కారణం...

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని ఆర్బాటం చేసిన మాజీ మంత్రి తన అనుచరగణం అక్రమాలు సైతం అదేస్థాయిలో చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇళ్ల స్థలాలు నా ఇష్టం వచ్చిన వారికి ఇచ్చుకుంటానని బాహాటంగానే చెప్పిన మంత్రి పట్టాలను సైతం అలాగే కెటాయించారు. దీంతో అర్హులైన జర్నలిస్టులు అన్యాయంతోపాటు అవమానానికి గురైయ్యారు. దీంతో అప్పటి మంత్రికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని కొంతమంది జర్నలిస్టులపై కేసులు సైతం నమోదు చేసి భయబ్రాంతులకు గురిచేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఇళ్ల స్థలాలపై విమర్శలతోపాటు అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అక్రమాలను గుర్తించిన అధికారులు ఆ పట్టాలను రద్దు చేసామని ప్రకటించడంతో పట్టాలు పొందిన జర్నలిస్టు వర్గాల్లో ఆందోళనకు గురవుతున్నారు.

అక్రమాలపై నోరుమెదపని మేయర్, మాజీ మంత్రి..

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల రద్దుపై ప్రకటన జర్నలిస్టులను ఆశ్చర్యానికి గురిచేసింది. అధికార హోదాతో మాజీ మంత్రి తన ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించి అక్రమాలకు తెరలేపగా నగర మేయర్ సైతం తన వ్యక్తిగత సిబ్బంది, జర్నలిస్టు వృత్తికి సంబంధం లేని వారికి పట్టాలు ఇప్పించుకోవడం అప్పట్లో జర్నలిస్టు వర్గాల్లో కలవరం రేపింది. వాటిపై తమ నిజాయితీని చాటుకోవాల్సిన సదరు నేతలు అది పక్కకు పెట్టి అక్రమాలపై నోరుమెదపకుండా పట్టాల రద్దుపై మాట్లాడడం తమ నిజాయితీకి నిదర్శనంగా నిలుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed