రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం.. MLA Dr. Sanjay Kumar

by Javid Pasha |   ( Updated:2022-12-24 10:04:20.0  )
రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం.. MLA Dr. Sanjay Kumar
X

దిశ, జగిత్యాల టౌన్: రైతాంగ సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలు అర్ధరహితమని, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై అనేకమార్లు బీఆర్ఎస్ ఎంపీలు పోరాటం చేశారని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల పట్టణంలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందని, గతంలో 69 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే, నేడు 2,40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పన్నులను చెల్లిస్తే అందులో నుండి కేంద్రం రాష్ట్రంలో అమలవుతున్న వివిధ పథకాలకు నిధులను సమకూరుస్తుందన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామని, గత ప్రభుత్వాల హయాంలో ఇన్ని పనులు జరగలేదన్నారు. ఉపాధి హామీ పథకం నిధులతో రైతు కల్లాలను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంటే కేంద్రం అడ్డుకోవడం సరైంది కాదన్నారు.

తెలంగాణకు హక్కుగా రావలసిన నిధులను కూడా కేంద్రం ఇవ్వడం లేదని, ఢిల్లీ కేంద్రంగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేశామన్నారు. బీఆర్ఎస్ నాయకులు స్థానికంగా నిరసనలు తెలపడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రైతులు, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడడం సరైంది కాదని, విశేష అనుభవమున్న, బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలు బాధాకరమన్నారు. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేకి ప్రభుత్వమని, తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని, బీఆర్ఎస్ ను కొందరు నాయకులు కావాలని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ ఎల్లారెడ్డి, మండల రైతు బంధు సమితి కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి, కౌన్సిలర్ ముస్కు నారాయణ రెడ్డి, నాయకులు మోహన్ రెడ్డి, రిజ్వన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed