- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సోనియమ్మ కంటే గొప్పదా MLC కవిత..? నిప్పులు చెరిగిన జీవన్ రెడ్డి
దిశ, జగిత్యాల ప్రతినిధి: దేశంలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం విషయంలో సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. జగిత్యాల ఇందిరా భవన్‌లో ఆయన చేసిన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి ఆరోపణలు ఎదురైనప్పుడు విచారణ చేపట్టే అధికారులు.. సోనియా, రాహుల్ గాంధీలను ఆఫీసులకు పిలిపించారని, కానీ ఎమ్మెల్సీ కవితకు మాత్రం విచారణ విషయంలో మినహాయింపు ఇవ్వడం ఏంటన్నారు. కవితకు ఎక్కడ వీలైతే అక్కడే విచారణకు హాజరు కావాలని సూచించడం విడ్డూరంగా ఉందన్నారు.
సోనియమ్మ కంటే గొప్పదా ఎమ్మెల్సీ కవిత అని ప్రశ్నించారు. సోనియా, రాహుల్ గాంధీలకో విధానం, కవితకో విధానమా అంటూ జీవన్ రెడ్డి మండిపడ్డారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎల్ రమణ విషయంలో జీవన్ రెడ్డి సానుకూలంగా మాట్లాడడం గమనార్హం. రమణాను కూడా ఈడీ కార్యాలయంలోనే విచారించిన అధికారులు, కవితకు ప్రత్యేక ఆఫర్ ఇవ్వడం వెనక ఆంతర్యం ఏంటో అంతు చిక్కడం లేదన్నారు. రమణను విచారించినట్టే కవితను విచారించాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ముఖ్యమంత్రి కూతురుకో న్యాయం ఇతరులకు మరో న్యాయమా అని ప్రశ్నించారు.
చక్కర ఫ్యాక్టరీ తెరిపించాలి..
డిసెంబర్ 7వ తేదీన సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఒకటైన ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారని, పూర్తిస్థాయిలో రుణమాఫీ రైతులను ఆదుకోవడంతో పాటు ధరణిలో ఉన్న లోపాలను సవరించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలు పరిష్కరించే వరకూ కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు గిరి నాగభూషణం, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు గాజంగి నందయ్య, కండ్లపాల్లి దుర్గయ్య, పుప్పాల అశోక్, మన్సూర్, నేహాల్, ధర రమేష్ బాబు, మహిపాల్, విజయ్ పాల్గొన్నారు.