ప్రజా పాలన దరఖాస్తుల ఆధారంగానే ఇందిరమ్మ ఇండ్లు

by Sridhar Babu |
ప్రజా పాలన దరఖాస్తుల ఆధారంగానే ఇందిరమ్మ ఇండ్లు
X

దిశ, కోరుట్ల : జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే లో ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లను గురువారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో, ఎర్దడి గ్రామంలో పాటు మెట్ పల్లి మండల వెంపేట్ గ్రామంలోని పలు వార్డుల్లో అధికారులు చేపట్టిన సర్వేను తనిఖీ చేశారు. యాప్ ద్వారా సర్వే చేపట్టాలని సూచించారు.

ఇందిరమ్మ పథకం కింద పూర్తిస్థాయి అర్హత గల నిరుపేద కుటుంబాలకు ఇళ్లను అందజేసే లక్ష్యంతో సర్వే చేయాలని సూచించారు. జిల్లాలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రజా పాలన దరఖాస్తు ఆధారంగా నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని తెలిపారు. ఎర్దండి గ్రామంలో సర్వే చేసిన సరళిని పరిశీలించారు. అనంతరం లబ్ధిదారుల వివరాలను యాప్ ద్వారా పొందుపరుస్తున్న వివరాలను స్వయంగా పరిశీలించారు. కలెక్టర్ వెంట హౌసింగ్ ఈఈ రాజేశ్వర్, తహసీల్దార్ లు, ఎంపీడీఓలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed