టీటీడీ ఆలయ నిర్మాణానికి అంకురార్పణ

by Shiva |
టీటీడీ ఆలయ నిర్మాణానికి అంకురార్పణ
X

టీటీడీ ప్రధానార్ఛకులు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో భూకర్షణం

కుటుంబ సమేతంగా హాజరైన మంత్రి గంగుల కమలాకర్

దిశ, కరీంనగర్ టౌన్ : ఆధ్యాత్మిక చింతనతో, గోవింద నామస్మరణతో కరీంనగర్ పులకించింది. సోమవారం ఉదయం మిథున లగ్నంలో స్వామి వారి ఆలయానికి భూ కర్షణంతో ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. కరీంనగర్ వాసులకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పించేందుకే కరీంనగర్ లో టీటీడీ క్షేత్రాన్ని నిర్మిస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ లో శ్రీవారి ఆలయానికి భూకర్షణంతో నేడు అంకురార్పణ జరిగింది. మంత్రి గంగుల కమలాకర్ ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరు కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్ఛకులు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచి టీటీడీ ఆలయం నిర్మించే స్థలంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్ఛకులు ఆధ్వర్యంలో భూకర్షణ హోమం, కలశారాధన, అష్టదిక్పాలకుల పూజ, మండప పూజ, కన్యకాపూజ, గోపూజ, ముత్తైదువ పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీవారి గర్బాలయం నిర్మించే స్థలంలో నాగలితో దున్ని, నవధాన్యాలను వెదజల్లారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్, కలెక్టర్ ఆర్.వీ.కర్ణణ్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీ.వీ రామక్రిష్ణారావు, మేయర్ సునీల్ రావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్ నాగలి పట్టుకుని దున్నితే, ముత్తైదువులు నవ ధాన్యాలను వెదజల్లారు. అనంతరం మహా పూర్ణాహుతి, విశేష ఆశీర్వచనం కార్యక్రమాలను నిర్వహించారు.

Advertisement

Next Story

Most Viewed