- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బైండోవర్ ఉల్లంఘించిన వ్యక్తికి జైలు శిక్ష
by Shiva |

X
దిశ, ముత్తారం: పెద్దపల్లి జిల్లా ఎక్సైజ్ సూరింటెండెంట్ ఆర్.మహిపాల్ రెడ్డి ఆదేశాల మేరకు అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన సంగెం రవి నాటు సారా తయారు చేస్తూ మంథని ఎక్సైజ్ అధికారులకు పట్టుబడ్డాడు. దీంతో అతడిని పోలీసులు ముత్తారం మండల ఎక్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ తహసీల్దార్ ఎదుట ఓ సంవత్సరం పాటు బైండోవర్ చేశారు. కానీ, యథావిధిగా అతను మళ్లీ నాటు సారా తయారు చేస్తూ మంథని ఎక్సైజ్ అధికారులకు పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు ముత్తారం తహసీల్దార్ ఎదుట హాజరు పరచగా అతడికి జైలు శిక్ష విధించారు. శుక్రవారం రవిని అరెస్ట్ చేసి కరీంనగర్ జైలుకు రిమాండ్ కు తరలించినట్లు ఎక్సైజ్ సీఐ జీ.గురవయ్య తెలిపారు. నాటు సారా తయారు చేసినా, అమ్మినా సరఫరా చేసినా కఠిన చర్యలు ఉంటాయని, బాధ్యులపై పీడీ యాక్ట్ పెడతామని ఎక్సైజ్ సీఐ హెచ్చరించారు.
Next Story