- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గొల్లపెల్లి ఎంజేపీలో విద్యార్థినిలకు అస్వస్థత..
దిశ,గొల్లపల్లి/జగిత్యాల : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. ఆగస్టు 15 సందర్భంగా నిర్వహించే గేమ్స్ లో భాగంగా ఖోఖో ఆడుతున్న సమయంలో ఐదుగురు విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అలర్ట్ అయిన పాఠశాల సిబ్బంది 108 అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థినులను తరలించారు. ఖోఖో ఆడుతుండగా ఆయాసానికి గురై హైపర్ టెన్షన్ కారణంగా అస్వస్థతకు గురైనట్టు డాక్టర్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం.
అయితే మరిన్ని వైద్య పరీక్షలు అనంతరం అసలు విద్యార్థినులకు ఏం జరిగింది అనే విషయం పూర్తిస్థాయిలో తెలిసే అవకాశం ఉంది. ఇటీవల జిల్లాలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల మృతి తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. గురుకుల పాఠశాలల్లో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పెద్దాపూర్ గురుకుల పాఠశాలలు సందర్శించిన గంటల వ్యవధిలోనే ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది.