కలెక్టర్ నే మార్చేశారు..

by Shiva |
కలెక్టర్ నే మార్చేశారు..
X

అధికారిక కార్యక్రమంలో అధికారులు తప్పిదం

దిశ, కొడిమ్యాల : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ అధికారుల నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది. మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేయించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ స్టేజీ వెనకాల కట్టిన ప్లెక్సీలో ప్రస్తుత జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా ఫోటోకు బదులుగా గతంలో కలెక్టర్ గా పని చేసిన గుగులోతు రవి ఫోటో ఉంది.

అయితే, కొత్తగా చేయించిన ఫ్లెక్సీలో తప్పిదం దొర్లిందా లేక పాత ఫ్లెక్సీనే ప్రోగ్రాంలో ఏర్పాటు చేశారా అనేది తెలియాల్సి ఉంది. స్థానిక ఎమ్మెల్యే, జడ్పీటీసీ, ఎంపీటీసీలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అటు అధికారులతో పాటు రాజకీయ నాయకులు ఎవరు కూడా ఈ తప్పిదాన్ని గుర్తించకపోవడం గమనార్హం. ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్పిదాలు జరగకుండా చూసుకోవాల్సిన అధికారుల తీరు పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Next Story