- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాషిగాంలో అర్ధరాత్రి హైరానా
దిశ, వెల్గటూర్: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాషిగాం గ్రామంలో అర్ధరాత్రి హైరానా నెలకొంది. గ్రామాన్ని దొంగలు చుట్టూ ముట్టారనే సమాచారం మేరకు అటు పోలీసులు ఇటు జనం ఉలిక్కిపడ్డారు. దొంగల భయంతో జనం రాత్రంతా నిద్ర లేకుండా జాగారం చేశారు. చివరికి గ్రామంలో చొరబడిన కొత్త వ్యక్తులను పోలీసులు జనం చుట్టుముట్టి పట్టుకోగా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించగా గ్రామంలో నెలకొన్న హైరానా సద్దుమణిగింది. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాషిగాం గ్రామంలో అర్ధరాత్రి దాటిన తర్వాత కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలో చొరబడగా యువకులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అయితే ఇటీవల గ్రామంలోని రెండిళ్లలో దొంగలు పడి లక్ష రూపాయల వరకు నగదు అపహరించుకుని వెళ్లారు. రెండు రోజుల క్రితం ఓ ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి విఫలయత్నం చేశారు. అప్పటి నుంచి గ్రామంలో ప్రజలందరూ దొంగల భయంతో రాత్రంతా టెన్షన్‌గానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని యువకులంతా ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని రాత్రిపూట ఊరిలో అలర్ట్ ఉంటున్నారు .
గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు అర్ధరాత్రి సమయంలో పొలానికి నీరు పెట్టి గ్రామానికి తిరిగివచ్చారు. సరిగ్గా అదే సమయంలో ఓ యువకుల గుంపు అర్ధరాత్రి గ్రామంలో సంచరిస్తుంది. దీంతో రైతులు వారిని ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన రైతులు గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామంలోని ప్రజలందరూ తీవ్రమైన భయాందోళన గురై నిద్రలేచి రాత్రంతా జాగారం చేశారు .వాట్సాప్ గ్రూప్ ద్వారా అలెర్ట్ అయిన యువకులు ఒక్కసారిగా బయటకు వచ్చి గ్రామంలో చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకున్నారు. అనంతరం గ్రామస్థులు, పోలీసులకు సమాచారం ఇవ్వగా స్థానిక ఎస్సై శ్వేత తన సిబ్బందితో కలిసి వచ్చి అర్ధరాత్రి గ్రామంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాత్రంతా పోలీస్ స్టేషన్‌లో ఉన్న వారిని ఉదయం పోలీసులు విచారించగా వారు వన్య ప్రాణుల వేట కోసం కరీంనగర్ నుంచి 55 కి.మీ దూరంలో ఉన్న పాషిగామ్ గ్రామంలోనికి ప్రవేశించినట్లు విచారణలో చెప్పారని ఎస్సై తెలిపారు. ఇంత దూరం వన్య ప్రాణుల వేటకు వచ్చారంటే కూడా నమ్మశక్యంగా లేదు. ఈ విషయంలో మరింత లోతుగా విచారణ చేసిన తర్వాతనే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.