- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ellampalli project : ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు..
దిశ, ధర్మారం : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలుప్రాజెక్టులోకి వరద భారీగా వచ్చి చేరుతోంది. జగిత్యాల ధర్మపురి వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతుంది.. ఎగువనున్న కడెం ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 7.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.3 టీఎంసీలకు చేరడంతో, అక్కడి అధికారులు 4233 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో, దిగువనున్న ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లోకి గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 17.81 టీఎంసీలకు చేరింది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లోని కడెం ప్రాజెక్ట్ ద్వారా ఎనిమిది వేల ఒక వంద 94 క్యూసెక్కుల నీరు, ఇతర పరివాహకల ద్వారా మరో 7887 క్యూసెక్కుల వరద నీరు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లోకి వచ్చి చేరుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండటానికి సుమారు రెండు టీఎంసీలు మాత్రమే మిగిలి ఉండటంతో ప్రాజెక్ట్ నిండు కుండలా మారి జలకలను సంతరించుకుంది.
ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి రెండు సొరంగ మార్గాల ద్వారా నీటిని నంది పంప్ హౌజ్ లోని సర్జ్ ఫుల్ లకు నీటిని తరలిస్తున్నారు. నంది పంప్ హౌజ్ లోని 2,3,5,6,7 నెంబర్ గల ఐదు బాహుబలి మోటార్ల ద్వార 15 వేల, 750 క్యూసెక్కుల నీటిని పక్కనే ఉన్న నంది రిజర్వాయర్ లోకి తరలిస్తున్నారు. అక్కడి నుంచి చామనపల్లి గ్రామ శివారులో ఉన్న మరో రెండు సొరంగ మార్గాల ద్వారా నీటి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ లోని గాయత్రి పంప్ హౌజ్ కు నీటిని తరలిస్తున్నారు. అక్కడి నుంచి భారీ మోటార్ల సాయంతో మిడ్ మానేరుకు గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నీటి తరలింపు ప్రక్రియ కొనసాగుతుందని ఈఈ నూనే శ్రీధర్ తెలిపారు. భారీ మోటార్లతో నీటి తరలింపు ప్రక్రియ కొనసాగుతుండంతో, అక్కడి దృశ్యాలను చూసేందుకు, ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చి సెల్ఫీలు, ఫోటోలు దిగుతూ సందడి చేస్తున్నారు.