బయట కొనాల్సిందే.. సర్కార్ దవాఖానాలో మందుల కరువు

by Aamani |
బయట కొనాల్సిందే.. సర్కార్ దవాఖానాలో మందుల కరువు
X

దిశ, గోదావరిఖని: గోదావరిఖనిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత వెంటాడుతోంది. ఆరోగ్యం బాగా లేదని ఆస్పత్రికి వెళితే.. అక్కడి డాక్టర్లు ప్రైవేట్ లో మందులు తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో డబ్బులు వెంచించి మందులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిరుపేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ రాసిన మందుల చీటీ పట్టుకొని ప్రభుత్వ దవాఖానాలోని మెడికల్ షాపు కు మందుల కొరకు పేషంట్ పోతే మా షాప్ లో లేవు బయట షాప్ లో కొనుక్కో అంటూ తిరిగి బయటకు పంపిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితి మధ్యతరగతి వారికి ఆర్థిక ఇబ్బంది కలిగిస్తుంది. ఇదే అదునుగా ప్రైవేట్ మెడికల్ షాప్ యాజమాన్యం అధిక రేట్లకు మందులు అమ్ముతున్నారు. అంతేకాకుండా అర్ధరాత్రి సమయంలో ప్రభుత్వ దవాఖానాలోని మందుల దుకాణం బంద్ ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ దవాఖాన ప్రిన్సిపాల్ పట్టించుకోకపోవడం పట్ల స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఆస్పత్రిలో మందుల కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు.

Advertisement

Next Story