పకడ్బందీగా హనుమాన్ చిన్న జయంతి

by Shiva |
పకడ్బందీగా హనుమాన్ చిన్న జయంతి
X

ఆలయ అధికారుల సమన్వయ సమావేశం

దిశ, మల్యాల: కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు ఏప్రిల్ 4 నుంచి 7 వరకు కొనసాగనున్నాయి. ఉత్సవ ఏర్పాట్లపై ఆలయ అధికారులు సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని భక్తులకు మరియు మాలదారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా భక్తులకు వసతులు కల్పించాలని ఆలయ అధికారులను కోరారు. వాటర్ ప్లాంట్ నిర్మించడంతో త్రాగునీటికి కొరత లేదని ఆయన అన్నారు. సానిటైజేషన్, చెత్త సేకరణ, క్లీనింగ్ సెక్షన్ కు సంబంధించిన కూలీలను ఎక్కువగా పెట్టి ఆలయ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా లడ్డు, పులిహోర తయారీ అన్నదాన సత్రంలో 2000 మందికి అన్నదానం చేసే వీలుండగా మరో చోట అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు తెలిపారు.

ధర్మపురి తరహాలో కార్యాచరణ రూపొందించాలని ఆయన అన్నారు. అదనపు కలెక్టర్ మకరంద ఆలయ అధికారులకు కొన్ని సూచనలు చేశారు. ఆలయ అధికారుల పర్యవేక్షణలో పనిచేసే వ్యక్తులను దాదాపుగా 20 గ్రూపులుగా విభజించి వేర్వేరు చోట్లలో ఉంచి ఒక్కో గ్రూపు నలుగురు సభ్యులుగా ఆ గ్రూప్ కు ఒక లీడర్ నీ నియమిస్తే భక్తుల సమస్యలను నివృత్తి చేసే వీలుంటుందని ఆయన అన్నారు.

భద్రతా పర్యవేక్షణ ల గురించి జిల్లా ఎస్పీ భాస్కర్ స్థానిక సీఐ, ఎస్ఐలకు పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాటు, అదనంగా 20 సీసీ కెమెరాలు దాదాపుగా 1,500 మంది భద్రత బలగాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, అదనపు కలెక్టర్ మకరంద, ఆర్డీవో, ఎస్పీ భాస్కర్, డీఎస్పీ, సీఐ, ఎస్సై మరియు వివిధ ప్రభుత్వ అధికారులు మరియు ఆలయ అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు .

Advertisement

Next Story

Most Viewed