- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పల్లెల్లో జోరుగా గుడుంబా విక్రయాలు.. అడ్డుకట్ట పడుతుందా?
దిశ, పెగడపల్లి: ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో మళ్లీ గుడుంబా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పచ్చని సంసారంలో చిచ్చులు మొదలు అవుతున్నాయి. మండల కేంద్రంలోని కొన్ని గ్రామాల్లో గత కొన్ని రోజులుగా గుడుంబా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. తనిఖీలు చేయాల్సిన అబ్కారీ శాఖ అధికారులు కనీసం ఆ పల్లెల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇక అబ్కారీ అధికారులతో కలిసి పని చేయాల్సిన పోలీస్ అధికారులు కూడా వాటి అమ్మకాల నియంత్రణ గురించి శ్రద్ధ చూపడం లేదు.
కౌన్సిలింగ్ తో మారిన జీవనాధారం
గతంలో గుడుంబా వ్యాపారం మండలంలోని కొన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున జరిగేది. అలాంటి సమయంలో తరచూ అబ్కారీ శాఖ అధికారులు దాడులు చేస్తూ ఎప్పటికప్పుడు గుడుంబా తయారీ దారులను హెచ్చరిస్తూ గుడుంబా విక్రయాలను తగ్గించారు. వాటి నియంత్రణ ద్వారా వారు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది అని మొర పెట్టుకోవడంతో పోలీస్ శాఖ వారి సహకారంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారి ఉపాధి కోసం ప్రత్యామ్నాయ మార్గాలు చూపించడంతో గుడుంబా తయారీ తగ్గుముఖం పట్టింది. దానితో గ్రామాల్లో గుడుంబా దొరకకపోవడంతో గుడుంబా ప్రియులు చేసేది ఏమి లేక ఎవరి పనులు వారు చేసుకుంటూ సంసారాలను సాఫీగా సాగించారు. దాంతో పల్లెల్లో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణం నెలకొనడం తో అందరూ హర్షం వ్యక్తం చేశారు.
మళ్లీ మొదలైన గుడుంబా అమ్మకాలు
కొన్ని సంవత్సరాలుగా అంత సవ్యంగా సాగుతుంది అని అనుకుంటున్న తరుణంలో మళ్లీ గ్రామాల్లో గుడుంబా వ్యాపారం చాప కింద నీరులా విస్తరిస్తుంది. అబ్కారీ అధికారులు ఇటు వైపు రాకపోవడం, పోలీస్ అధికారులు వారి మీద నిఘా తగ్గించడంతో మళ్లీ యదేచ్ఛగా గుడుంబా అమ్మకాలు సాగుతున్నాయి. మొన్నటికి మొన్న ఆంధ్రలో కల్తీ సారా తాగి పలువురు మృతి చెందిన విషయం తెలిసి అలాంటి సంఘటనలు జరిగితే తప్ప అబ్కారీ వాళ్ళు గుడుంబా స్థావరాల మీద దాడులు చేయరా అని మహిళకు చర్చించుకుంటున్నరు.
ఫోన్ చేసినా.. పోలీస్ శాఖ స్పందన అంతంత మాత్రం
కొసమెరుపు ఏంటంటే గుడంబా విక్రయాలు జరుగుతున్నాయని పోలీస్ అధికారులకు ఫోన్ లో సమాచారం అందించగా.. తనిఖీలు చేసి అమ్మకందారులను పట్టుకుని సమస్యని పరిష్కరిస్తామని చెప్పారు తప్ప ఇప్పటివరకు ఆ ప్రయత్నం ఏమి చేయడం లేదు. ఇప్పటికైనా అబ్కారీ అధికారులు, పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు నిఘా పెట్టి గుడుంబా తయారీ నీ నియంత్రించాలి అని కోరుతున్నారు.