కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి: ప్రభుత్వ విప్ కౌశిక్ రెడ్డి

by Shiva |
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి: ప్రభుత్వ విప్ కౌశిక్ రెడ్డి
X

దిశ, హుజూరాబాద్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి రైతులకు సూచించారు. మండలంలోని పెద్ద పాపయ్యపల్లిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దళారులను ఆశ్రయించి మోసపోవొద్దన్నారు. రైతాంగ సంక్షేమమే పరమావధిగా భావిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మెన్ ఎడవల్లి కొండాల్ రెడ్డి, సర్పంచ్ పోరెడ్డి రజిత, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు దాసరి రమణారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంగం ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed