- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించడమే ప్రభుత్వ ధ్యేయం : పెద్దపల్లి ఎమ్మెల్యే
దిశ,సుల్తానాబాద్ : సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలో సీఎం కప్ టార్చి రిలే క్రీడా జ్యోతి ర్యాలీ కార్యక్రమాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రారంభించారు.అనంతరం శాస్త్రి నగర్ నుంచి జూనియర్ కాలేజీ వరకు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే సుల్తానాబాద్ క్రీడాకారులకు పుట్టినిల్లు అని, ఇక్కడి నుండి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు ఉన్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు క్రీడలను విస్మరించి పాలన కొనసాగించిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహజంగా వాలీబాల్ క్రీడాకారుడు కాబట్టి క్రీడలను ప్రోత్సహించి జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయాలనే సంకల్పంతో క్రీడలకు కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నారని అన్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి ప్రతి మండల జిల్లా హెడ్ క్వార్టర్స్ లలో కబడ్డీ, వాలీబాల్, కోకో ఇతరత్రా క్రీడలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర క్రీడా శాఖ మంత్రితో చర్చించి ఒలంపిక్ క్రీడలను తెలంగాణ ప్రాంతంలో నిర్వహించాలని, ఇక్కడి క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని వివరించారు.
క్రీడాకారులను ప్రోత్సహించాలనే సంకల్పంతోనే క్రికెటర్ క్రీడాకారుడు సిరాజ్ జానీ, నికిత్ జరిన్, లకు డీఎస్పీ ఉద్యోగాలు ఇచ్చి ప్రోత్సహించారని అలాగే వరంగల్ క్రీడాకారుడికి కోటి రూపాయల నగదును అందించి వరంగల్ నడిబొడ్డులో ఆరు వందల గజాల స్థలాన్ని కేటాయించి ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి మండల కేంద్రంలో, అలాగే జిల్లా కేంద్రంలో కోచింగ్ జిమ్ సెంటర్ లను నెలకొల్పే సంకల్పంతో ముఖ్యమంత్రి ముందుకు పోతున్నారని, సీనియర్ క్రీడాకారులు నూతనంగా క్రీడారంగం లోకి ప్రవేశిస్తున్న క్రీడకాలను ప్రోత్సహించి వాళ్లను క్రీడారంగంలో రాణించే విధంగా సహకారం అందించాలని అన్నారు.
సుల్తానాబాద్ లో కేలో ఇండియా కోచింగ్ సెంటర్ ను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం క్రీడా రంగంలో రాణించిన క్రీడాకారులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ గాజుల లక్ష్మి రాజమల్లు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ బిరుదు సమత కృష్ణ ,డివైస్ ఓ సురేష్, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముత్యాల రవీందర్ తోపాటు వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.