- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తడిచిన వరి ధాన్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి
మాజీ ఎమ్మెల్యే విజయరమణ రావు
దిశ, ఓదెల : తడిచిన వరి ధాన్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ ఎమ్మెల్యే విజయరమణ రావు అన్నారు. ఓదెల మండలంలో ఆదివారం రాత్రి ఈదురు గాలులు, వడగళ్ల వర్షానికి తడిసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షులు చింతకుంట విజయరమణ రావు పరిశీలించారు.
కొలనూర్ వరి కొనుగోలు కేంద్రంలో రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆరు నెలలు కష్టపడి పండించిన పంట అమ్మకానికి నేలపాలైందని అన్నారు. ధాన్యం కొనగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యం కుప్పలను పోయగా సాయంత్రం, రాత్రి కురిసిన వర్షానికి వడ్లు మొత్తం తడిసి రంగు మారి మొలకలు వచ్చాయని అన్నారు. తడిచిన వరి ధాన్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
స్థానిక ఎమ్మెల్యే రైతుల బాగోవులు చూడకుండా.. రైతుల కష్టాలను, ఇబ్బందులను పట్టించుకోకుండా పబ్బం గడుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు.పెద్దపల్లి జిల్లా కలెక్టర్ తో పాటు సంబంధిత అధికారులను ఫోన్లో విజయ రమణ రావు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వినుపాల ప్రకాష్ రావు, మాటూరి నరసయ్య, బైరి సంతోష్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.