- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జిల్లా వ్యాప్తంగా ప్రతి కళాశాలలో ఉచిత వైద్య పరీక్షలు: మంత్రి గంగుల కమలాకర్
దిశ, కరీంనగర్: రాష్ట్రంలో చిన్న వయసు వారు గుండెపోటుతో మరణిస్తున్న తరుణంలో జిల్లాలోని ప్రతి కళాశాలలో నిర్భంద వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు చర్యలు తీసుకోనున్నట్లు బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గుంగుల కమలాకర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు, ఐఎంఏ అసోసియేషన్, ఫార్మసీ అసోసియేషన్, వైద్యాధికారులు, కార్టియాలజిస్టులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో చిన్న వయస్సు వారు కూడా గుండెపోటుతో మరణిస్తుండడం భాధకరమని తెలిపారు.
కరీంనగర్ జిల్లాలో ఎక్కడా కూడా ఇటువంటి ఘటనలు జరుగకుండా ఆరోగ్యవంతమైన జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఉచిత వైద్య శిబిరం, ఆరోగ్య పరీక్షల కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు ఆయన తెలిపారు. అన్ని కళాశాలల్లోని విద్యార్థులకు నిర్భంద గుండే సంబంధిత ఈసీజీ, రక్త పరీక్ష మొదలగు వైద్య పరీక్షలను నిర్వహించేలా ప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు. ఆ దిశగా విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. అదేవిధంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, ఐఎంఏ, డయోగ్నోస్టిక్ నిర్వహాకులు కార్యక్రమానికి తమ వంతు సహాకారాన్ని అందించాలన్నారు.
నిర్భంధ వైద్య పరీక్షలతో అనారోగ్యంగా ఉన్న వారిని ముందుగానే గుర్తించివారి ప్రాణాలను కాపాడేందుకు వీలుంటుందన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు ముందుకొచ్చి మానవతా దృక్పథంతో సేవ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.వీ. కర్ణన్, పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు, నగర మెయర్ సునీల్ రావు, అడిషన్ కలెక్టర్లు జీవీ. శ్యాంప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, ట్రైనీ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, అధికారులు, డాక్టర్లు, ఐఎంఏ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.