Food inspections : పల్లెల్లో ఆహార తనిఖీల జాడేది...?

by Sumithra |
Food inspections : పల్లెల్లో ఆహార తనిఖీల జాడేది...?
X

దిశ, కథలాపూర్ : కుటుంబంతో కలిసి హోటల్స్, రెస్టారెంట్లకు వెళ్లి పసందైన వంటకాలను రుచులను ఆరగించడం ప్రస్తుత కాలంలో ప్రజలకు అలవాటుగా మారింది. అధిక జనం వీకెండ్ వచ్చిన, లేదంటే నలుగురు మిత్రులు కలిసినప్పుడు హోటల్లో, రెస్టారెంట్లకు వెళ్లి భోజనాలు ఆరగిస్తుంటారు. అలాంటి హోటల్స్, రెస్టారెంటుల్లో వంటల కోసం ఎలాంటి నూనెలు వాడుతున్నారు. అలాగే ఎలాంటి మాంసమును వినియోగిస్తున్నారు. ఆరోగ్యకరమైన జంతువుల మాంసమే వాడుతున్నారా ఇలాంటి వాటి పై దృష్టి సారించి హోటల్స్ లో ప్రజలకు నాణ్యమైన ఆహారం అందుతుందా అనే అంశం పై ఆహారం నాణ్యత పరీక్షల కోసం ల్యాబ్ కు పంపాల్సి ఉంటుంది. ఈ అంశం పై పట్టణాలకే పరిమితమవుతున్న తనిఖీలు పల్లెల వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.

మండల కేంద్రాల్లో, మండలంలోని గ్రామాల్లో సిటీని తలపించేలా హోటల్స్ , రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వెలిశాయి. అక్కడ ఎలాంటి వస్తువులను ఉపయోగించి వంటకాలు తయారీ చేస్తున్నారో ఆహార తనిఖీ అధికారులు దృష్టి సారించడం లేదని విమర్శలు జోరందుకున్నాయి. హోటల్స్ యజమానులు నియమాలు పాటించక పోవడంతో ప్రజలు వ్యాధులకు గురవుతున్నట్లు వైద్య నిపుణులు చెప్పకనే చెబుతున్నారు. మరి కడుపులోకి తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకుండా ఎక్కడపడితే అక్కడ దొరికింది తినేస్తే రోగాలు చుట్టుముట్టడం ఖాయం.. మరి తినేవారు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందా..? అమ్మేవారి సంగతేంటి...? హోటల్స్, రెస్టారెంట్ల పై ఆ శాఖ అజమాయిషి కనపడటం లేదు.. వారు ఎలాంటి నూనెలు వాడుతున్నారు. వంటల్లో వాడే వస్తువులు కాలం చెల్లినవి వాడుతున్నారా...? వండి వారిచే ఆహార నాణ్యత ఎలా వుంది అన్నవిషయం పై తనిఖీ చేసే అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్లే ఉన్నారు.

ఇలాంటి వాటిని తనిఖీ చేసేందుకు ఓ శాఖ ఉంది. అధికారులు ఉన్నారన్న సంగతే జగిత్యాల జిల్లాలోని ప్రజలు మర్చిపోయారు. నిత్యం ఆహార తనిఖీల నాణ్యతను పరిరక్షించే ఫుడ్ ఇన్స్పెక్టర్ జాడ దొరకడం లేదు. దీంతో రోజురోజుకు ప్రజాఆరోగ్యం ప్రమాదంలో పడిపోతుంది. ఇక్కడ ఆహార పదార్థాల కొనుగోళ్లకు ఉన్న డిమాండ్ గ్రహించి కొందరు స్థానికులు కూడా హోటల్స్ ను నెలకొల్పారు. ఈ ఆహార కేంద్రాలు భోజన ప్రియులను ఆహ్వానిస్తూ ఉంటాయి. ఇక్కడ ఆహార పదార్థాల కొనుగోళ్లకు ఉన్న డిమాండ్ గ్రహించి కొందరు ఇతర ప్రాంతాల వారు కూడా నెలకొల్పారు. నాసిరకం తినుబండారాలు విక్రయిస్తూ బేకరీలు అధికారుల దందా విచ్చలవిడిగా కొనసాగుతుంది.. అయినా ఇట్టి ఆహారాల పై అధికారులు తనిఖీ చేస్తే ప్రజారోగ్యం మెరుగుపరిచిన వారవుతారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇలా విచ్చలవిడిగా వెలసిన హోటల్స్, బేకరీలలో ఎలాంటి ఆహారాన్ని ప్రజలకు ఎక్కువసార్లు కాగిన నూనెలను వాడుతున్నట్లు, దీంతో అంతుచిక్కని వ్యాధులు చుట్టూ ముట్టడం ఖాయమని, అందరికీ తెలిసిన విషయమే. మరి ఇలాంటి హోటల్స్, పర్మిట్ రూమ్స్ లో ఎలాంటి నూనెలతో వండి వడ్డిస్తున్నారన్న విషయం ఏ ఒక్కరికి తెలియదు. ఇది తెలుసుకోవాల్సిన ఫుడ్ ఇన్స్పెక్టర్ పని చేస్తున్నారో లేదోనన్న సందేహం కలుగుతుంది. గత కొన్నేళ్లుగా నడుస్తున్న ఈ హోటల్స్, బేకరీ, పర్మిట్ రూమ్స్ లో ఏ ఒక్కసారి కూడా ఆహార తనిఖీలు చేసి ఫుడ్ పొజిషన్ తనిఖీ చేశారన్న దాఖలాలు లేవనే చెప్పవచ్చు. ఇప్పటికైనా తనిఖీలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed