రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ : మంత్రి గంగుల కమలాకర్

by Shiva |
రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ : మంత్రి గంగుల కమలాకర్
X

దిశ, కరీంనగర్ బ్యూరో: ఆకాలవర్షం, ఈదురు గాలులతో పంట నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్, ఇరుకుల్ల మరియు చామన్ పల్లి గ్రామాల్లో ఈదురు గాలులు, అకాల వర్షాలతో వరి, మొక్కజోన్న, మామిడి పంటలను నష్టపోయిన రైతులను కలెక్టర్ కర్ణన్ తో కలిసి మంత్రి గంగుల పరీశీలించారు. అనంతరం ఆయన రైతులతో మాట్లాడారు.పంట నష్టపోయిన ఏ ఒక్క రైతు కూడా బాధపడాల్సిన అవసరం లేదని, వారికి ప్రభుత్వమే అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు.

సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతిగా రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. కరీంనగర్ రూరల్ మండల పరిధిలో ఆకాల వర్షాలు, ఈదురు గాలులకు 270 ఎకరాల్లో వరి, 320 మామిడి, 181 ఎకరాల్లో పండ్ల తోటలు దెబ్బతిన్నాయని.. పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేశామని ఆయన పేర్కొన్నారు. మంత్రి గంగుల వెంట కలెక్టర్ ఆర్.వీ కర్ణన్, అదనపు కలెక్టర్ జీ.వీ శ్యాంప్రసాద్ లాల్, ఆర్డీవో ఆనంద్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, తహసీల్దార్ నారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story