- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మానవ హక్కులపై అందరికీ అవగాహన ఉండాలి !
దిశ, గోదావరిఖని : వ్యక్తి గౌరవం కూడా మానవ హక్కులేనని తెలంగాణ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ ఈదునూరి శంకర్ అన్నారు. గోదావరిఖని పవర్ హౌజ్ కాలనీలోని ప్రభుత్వ శాఖ గ్రంధాలయంలో ఆదివారం 'మానవ హక్కుల పరిరక్షణ' అనే అంశంపై ఈదునూరి శంకర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ ఒక వ్యక్తి గౌరవంగా, హుందాగా, ఆరోగ్యంగా, నిర్భయంగా, స్వేచ్ఛ, సంతోషంతో జీవించడమే మానవ హక్కులని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులతోపాటు అంతర్జాతీయంగా ఏర్పడిన హక్కులపై కూడా ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. వ్యక్తి గౌరవం కూడా మానవహక్కులేనని, ఒక వ్యక్తిని తిట్టిన, అతని పై అగౌరవపరిచిన మానవ హక్కుల ఉల్లంగనే అవుతుందన్నారు.
ప్రభుత్వ శాఖల అధికారులు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే, హెచ్ఆర్సీలో సదరు ప్రభుత్వ అధికారుల పై మానవ హక్కుల కింద కేసునమోదు చేయొచ్చని తెలిపారు. ఈరోజు అందరూ స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే, ఎంతోమంది మహనీయులు త్యాగపరంగా మానవ హక్కులు కల్పించబడ్డాయని వెల్లడించారు. కానీ ఈ హక్కులపై ప్రజలలో సరైన అవగాహన లేకపోవడంతో, మనకు కల్పించిన హక్కులను వినియోగించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అందరూ మానవ హక్కులను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా నాయకులు దేశ బోయిన శ్రీనివాస్, శాఖ గ్రంధాల లైబ్రేరియన్ ఎం.భారతి, టీయూడబ్ల్యూజె జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.ఎస్.వాసు, నాయకులు దబ్బెట శంకర్, ఉట్ల సురేష్, అనురాగ్ ప్రీతం, ఎల్కపల్లి అనిల్, సంపత్, శ్రీలక్ష్మి, అనిల్ పాల్గొన్నారు.