ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. ఈటెల వాహనంలో ముమ్మర తనిఖీలు

by Mahesh |   ( Updated:2023-10-30 06:34:39.0  )
ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. ఈటెల వాహనంలో ముమ్మర తనిఖీలు
X

దిశ, హుజురాబాద్: మొట్ట మొదటి సారిగా హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ అభ్యర్థిగా ప్రచారం మొదలు పెట్టడానికి వస్తున్న సందర్భంగా మండలంలోని పరకాల చెక్ పోస్ట్ వద్ద ఈటల రాజేందర్ వాహనాన్ని సోమవారం పోలీస్‌లు తనిఖీ చేశారు. చెక్ పోస్ట్ వద్ద ఈటల, జమునల వాహనాలను తనిఖీ చేసి ఏమి లేకపోవడంతో వదిలి పెట్టగా పోలీస్‌లను ఉద్దేశించి ఏమైనా దొరికితే నాకు ఇవ్వండి ఎన్నికల్లో ఖర్చు పెడతా అని అనడం కొస మెరుపు. అనంతరం జమ్మికుంట మండలం నాగారం వెళ్లి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి పూజ చేశారు. తర్వాత కమలాపూర్‌లో ప్రచార కార్యక్రమం‌లో పాల్గొంటారు.

Advertisement

Next Story