తాగునీటి సరఫరాకు ఇబ్బందులు రాకుండా చూడాలి : ఎమ్మెల్యే కవ్వంపల్లి

by Aamani |
తాగునీటి సరఫరాకు ఇబ్బందులు రాకుండా చూడాలి : ఎమ్మెల్యే కవ్వంపల్లి
X

దిశ, తిమ్మాపూర్ : గ్రామాల్లో తాగునీటి సరఫరా ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. మంగళవారం తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ లోని మిషన్ భగీరథ కార్యాలయంలో నిర్వహిస్తున్న గ్రామ తాగునీటి నిర్వాహకుల శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న చేతి పంపుల మరమ్మతులు ఎప్పటికప్పుడు చూసుకోవాలని, బోరు మోటార్ల మరమ్మతులను చేపట్టి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు.

Next Story