కాంటలు వేయాలని రోడ్డెక్కిన అన్నదాతలు..

by Anjali |   ( Updated:2023-05-15 07:21:53.0  )
కాంటలు వేయాలని రోడ్డెక్కిన అన్నదాతలు..
X

దిశ, శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నం మార్కెట్‌లో ధాన్యం కాంటాలు వేయాలని అన్నదాతలు సోమవారం జాతీయ రహదారి ఎక్కి ఆందోళన నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న శంకరపట్నం తాసిల్దార్ గూడూరి శ్రీనివాసరావు, కేశవపట్నం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రైతులకు శాంతింపజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. శంకరపట్నం మండలంలోని కేశవపట్నం మార్కెట్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో గత శుక్రవారం నుండి నేటి వరకు కాంటాలు వేయకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఆందోళన వ్యక్తం చేశారు.

రైతుల కష్టాలు తీర్చాలని జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించిన తెలిపారు. గురువారం కాంటాలు వేసిన ధాన్యాన్ని ట్రాక్టర్లో లోడ్ చేసుకుని దిగుమతి కోసం రైస్ మిల్లులకు వెళ్ళగా, సోమవారం వరకు దివత్ కాకపోవడంతో రైతులు, ట్రాక్టర్ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న శంకరపట్నం తాసిల్దార్ గూడూరి శ్రీనివాసరావు, ధర్నా స్థలానికి రాస్తారోకో వివరింపజేసి, మార్కెట్ యార్డులో రైతులతో మాట్లాడి తగిన న్యాయం చేస్తానని రైతులకు నచ్చ చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story