Collector Koya Sriharsha : రైతుల వద్ద నుంచి మద్దతు ధరపై పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు

by Aamani |
Collector Koya Sriharsha : రైతుల వద్ద నుంచి మద్దతు ధరపై పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు
X

దిశ,ధర్మారం: ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విస్తృతంగా జిల్లా కలెక్టర్ పర్యటించారు.మండలంలోని దొంగతుర్తి ,ధర్మారం వ్యవసాయ మార్కెట్ యార్డు,మల్లాపూర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేసి అందుబాటులో ఉన్న వసతులను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ... కొనుగోలు కేంద్రాల ఇంచార్జి అధికారులు రైతుల వద్ద నుంచి నాణ్యమైన ధాన్యాన్ని మద్దతు ధర పై వేగవంతంగా కొనుగోలు చేసే దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని,వ్యవసాయ అధికారులు కోతల సమయంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని,హార్వెస్టర్ల వినియోగంలో పాటించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించాలన్నారు.

ధాన్యం నాణ్యత ప్రమాణాలు విస్తృతంగా ప్రచారం చేయాలని, రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకుని వచ్చే విధంగా చూడాలని, అలాగే కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద నుంచి మద్దతు ధరపై ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత వెంటనే సంబంధిత మిల్లులకు లేదా గోదాములకు తరలించాలన్నారు. ధాన్యం తరలింపులో ఎక్కడ వాహనాల కొరత రాకుండా చూసుకోవాలని,కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చే రైతుల వద్ద నుంచి నాణ్యమైన ధాన్యాన్ని మద్దతు ధరపై పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి,జిల్లా సహకార అధికారి శ్రీమాల,కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలు సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed