- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Heart health : కళ్లచుట్టూ ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి.. గుండెపోటుకు దారితీయవచ్చు !
దిశ, ఫీచర్స్ : ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అంటారు పెద్దలు. నిజానికి కళ్లు లేకపోతే మనం ఈ ప్రపంచాన్ని, అందమైన ప్రకృతిని చూడలేం. అందుకే వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే చూపు విషయంలోనే కాకుండా, మన శరీరంలోని ఇతర అనారోగ్యాలకు సంబంధించిన పలు సంకేతాలు, లక్షణాలు కూడా కళ్లచుట్టూ జరిగే మార్పుల ద్వారా తెలుసుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాంటి వాటిలో కళ్ల చుట్టూ వలయాలు ఏర్పడటం, చర్మం రంగు మారడం, కళ్లు ఉబ్బడం కూడా ఒకటి. మీలో గనుక ఈ లక్షణం కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయద్దు. ఎందుకంటే అది గుండెపోటుకు దారితీవయచ్చు!
కళ్లచుట్టూ చర్మం పసుపు రంగులోకి మారినట్లు మీకు అనుమానం వస్తే గనుక వెంటనే అలర్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే రక్తంలో లిపిడ్ స్థాయిలు అసాధారణంగా పెరిగినప్పుడు, ధమనుల్లో కొవ్వు పేరుకుపోయినప్పుడు కూడా ఇలా జరుగుతుంది. ఎప్పుడైతే ధమనుల్లో లేదా రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోతుందో అది తర్వాత క్రమంలో బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు వంటి ప్రమాదాలకు దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు.
కళ్లకింద లేదా చుట్టూత స్కిన్ ఎల్లో కలర్‌లోకి మారడమే కాకుండా కంటిలోని నల్ల గుడ్డు చుట్టూ నీలం లేదా బూడిద రంగులో కార్నియా ఏర్పడినా ప్రమాదమే. ధమనుల్లో, రక్త నాళాల్లో కొవ్వు పెరిగిందనడానికి ఇది కూడా ఒక సంకేతంగా ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి ఈ లక్షణాలు ఎప్పుడు కనిపించగానే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.