మీడియా రంగంలో దిశ సంచలనం

by Sridhar Babu |
మీడియా రంగంలో దిశ సంచలనం
X

దశ, ఎల్లారెడ్దిపేట : ప్రస్తుత మీడియా రంగంలో దిశ దినపత్రిక ఓ సంచలనం అని తహసీల్దార్ బోయిని రాంచందర్ అన్నారు. ఎల్లారెడ్దిపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో దిశ దినపత్రిక 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను పలు శాఖల అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ అతి తక్కువ కాలంలో దిశ దినపత్రిక ఎనలేని గుర్తింపు పొందిందని అన్నారు. అదే విధంగా ఎంపీడీఓ సత్తయ్య మాట్లాడుతూ స్పాట్ వార్తలు ఎప్పటికప్పుడు కేవలం దిశలో మాత్రమే రావడం జరుగుతుందని అన్నారు.

మండల విద్యాధికారి కృష్ణ హరి మాట్లాడుతూ సమాజంలో సామాజిక రుగ్మతలను తొలగించడంలో దిశ చేస్తున్న కృషి అభినందనీయం అని అన్నారు. సెస్ ఏఈ పృథ్వీదర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం దిశ ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగంను కదిలిస్తున్న విధానం హర్షించదగినదని అన్నారు. ఐకేపీ ఏపీఎం మల్లేశం మాట్లాడుతూ అధికారులకు, ప్రజలకు మధ్య దిశ దినపత్రిక వారథిగా పనిచేస్తోందని అన్నారు. అదే విధంగా కమ్యూనిటీ హెల్త్ ఇంచార్జీ వైద్యులు రఘు మాట్లాడుతూ విప్లవాత్మక వార్తలు రావడం కేవలం దిశ దినపత్రికలో మాత్రమే చూస్తున్నామని అన్నారు.

ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం లో దిశ దినపత్రిక రిపోర్టర్ ఒగ్గు బాలరాజ్ యాదవ్, ఎంపీడీఓ సత్తయ్య, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇంచార్జి వైద్యులు రఘు, ఏపీఎం మల్లేశం,ఎల్లారెడ్డి పేట పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, మాజీ వైస్ ఎంపీపీ కదిరే భాస్కర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి బాల్ రెడ్డి, బీజేపీ నాయకులు రాగుల గాల్ రెడ్డి, నమిలికొండ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed