- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దిశ ఎఫెక్ట్.. 48 గంటల్లో వాటిని తొలగించాలి

దిశ, జగిత్యాల రూరల్ : నర్సింగాపూర్ గ్రామంలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ పట్టాల రద్దు వ్యవహారంలో ‘ధరణి అక్రమ పట్టాల్లో వాట్ నెక్స్ట్’అనే కథనానికి జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ స్పందించారు. బుధవారం ఉదయం గ్రామంలోని 437, 251 సర్వే నెంబర్లలో గల ఇటుక బట్టీలను సందర్శించారు. ఇప్పటికే పట్టాలను రద్దు చేసిన కలెక్టర్ ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేసిన ఇటుక బట్టీలను తొలగించాల్సిందిగా నిర్వాహకులకు 48 గంటల డెడ్లైన్ విధించారు. తొలగించని పక్షంలో నిర్వాహకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, అక్కడ ఉన్న మెటీరియల్ వేలం వేసి క్లియర్ చేస్తామని స్పష్టం చేశారు.
437, 251 సర్వే నెంబర్లలో ఎంక్వయిరీ చేసిన తర్వాత పట్టాలు రద్దు చేసి ఆ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని అన్నారు. ప్రభుత్వ భూములను అక్రమంగా పట్టాలు చేసుకున్న వ్యవహారంలో చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. అయితే మొదటగా ప్రభుత్వ భూములను డాక్యుమెంట్స్ పరంగా స్వాధీనం చేసుకున్నామని త్వరలోనే పూర్తిగా భూములన్నింటినీ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటుందని వివరించారు. న్యాయ నిపుణుల సలహా మేరకు అక్రమ పట్టాలు చేసుకున్న వారితోపాటు వారికి సహకరించిన అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.