రేపు కొత్త ఆర్వోఆర్ బిల్లుపై చర్చా కార్యక్రమంః కలెక్టర్ శ్రీ హర్ష

by Nagam Mallesh |
రేపు కొత్త ఆర్వోఆర్ బిల్లుపై చర్చా కార్యక్రమంః కలెక్టర్ శ్రీ హర్ష
X

దిశ, పెద్దపల్లిః ఆగస్టు 22న కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లుపై చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రవేశపెట్టిన నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లుపై జిల్లాలోని రైతు సంఘాలు, మేధావులు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు (రిటైర్డ్& సర్వీస్) లతో చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ చర్చా కార్యక్రమంలో వచ్చిన సూచనలు, సలహాలు రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నివేదిస్తామని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని మేధావులు, నిపుణులు ఆగస్టు 22న సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లు పై నిర్వహించే చర్చ కార్యక్రమంలో పాల్గొని తమ విలువైన సూచనలు సలహాలు అందజేయాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.

Advertisement

Next Story