Sircilla Congress: సిరిసిల్ల కాంగ్రెస్‌లో రచ్చకెక్కిన విబేధాలు.. బీజేపీలోకి మహేందర్ రెడ్డి?

by Sathputhe Rajesh |   ( Updated:2022-08-12 06:32:52.0  )
Differences among Congress leaders in Sircilla Constituency to the fore again
X

దిశ, రాజన్నసిరిసిల్ల: Differences among Congress leaders in Sircilla Constituency to the fore again| రాజన్నసిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు, లుకలుకలు బయటపడ్డాయి. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పాదయాత్రకు పూనుకున్నారు. ఈ పాదయాత్ర టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో మొదలుపెట్టాడు. మంత్రి కేటీఆర్ పై ఎమ్మెల్యేగా రెండు సార్లు ఓటమి పాలైన సిరిసిల్ల కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి.. పొన్నం ప్రభాకర్ పాదయత్రకు హజరుకాకపోవడం సిరిసిల్లలో రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. సిరిసిల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డి పేరు వినిపిస్తున్న తరుణంలో కరీంనగర్ మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నేత చేపట్టిన పాదయాత్రకు హజరుకాకపోవడం, తన వర్గీయులు కూడా మెజార్టీ నాయకులు ఈ పాదయాత్రకు దూరంగా ఉండటంతో సిరిసిల్ల కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్నట్లు అర్థమవుతుంది.

పొన్నం పాదయాత్రకు చొప్పదండి నియోజకవర్గం నుంచి మేడిపల్లి సత్యం, వేములవాడ నియోజకవర్గం నుంచి ఆది శ్రీనివాస్, హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ లో కొత్తగా చేరిన టీవీ యాంకర్ కత్తి కార్తీక కూడా హజరయ్యారు. కానీ సిరిసిల్ల స్థానిక నేత కేకే మహేందర్ రెడ్డి ఈ పాదయాత్రకు హజరుకాలేదు. దీనికి తోడు సిరిసిల్లలో పాదయాత్ర సందర్బంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీల విషయంలో కాంగ్రెస్ నేతలు సంగీతం శ్రీనివాస్, సూర దేవరాజులు ఘర్షణ పడ్డారు. నువ్వెంత అంటే నువ్వెంత అని మాట మాట పెరిగిపోగా.. స్థానిక నాయకులు ఇద్దరిని సముధాయించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో.. కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు పార్టీకి పెద్ద నష్టాన్ని కలిగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

కేకే మహేందర్ రెడ్డి చూపు ఎటువైపు..?

2009లో సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ పై స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కేవలం 171 ఓట్ల తేడాతో ఓడిన కేకే మహేందర్ రెడ్డికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చింది. తెలంగాణా వాదిగా కేసీఆర్ తీరును వ్యతిరేకించి టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి వివిధ పార్టీలో చేరి కేటీఆర్ పై ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ పోరాటం కొనసాగిస్తూనే వస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కేకే మహేందర్ రెడ్డి కొనసాగుతున్నా. సిరిసిల్ల నియోజకవర్గంలో అంతాగా పర్యటించడం లేదు. మీడియా సమావేశాలు తప్ప కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు.

సిరిసిల్ల నియోజకవర్గంలో బలమైన నేతగా పేరున్న కేకే మహేందర్ రెడ్డి రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న చర్చ సిరిసిల్లలో కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారా..? లేదా బీజేపీ పార్టీ వైపు కేకే చూపు పడిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కేకే వర్గీయుల మాత్రం అయోమయంలో పడిపోతున్నారు. ఎటు వైపు ఉంటే ఏం జరుగుతుందోనన్న భయంతో కక్కలేక మింగలేక కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఏది ఏమైనా కేకే మహేందర్ రెడ్డి పొన్నం ప్రభాకర్ పాదయాత్రలో పాల్గొనకపోవడం రాజకీయంగా సిరిసిల్లలో చర్చ కొనసాగుతుంది.

యాంకర్ మేఘనతో కొణిదెల హీరో ఎంగేజ్మెంట్..

Advertisement

Next Story