ఇన్నాళ్లకు నేతన్నలు గుర్తుకు వచ్చారా.. కేటీఆర్ బహిరంగ లేఖకు బండి కౌంటర్

by Aamani |
ఇన్నాళ్లకు నేతన్నలు గుర్తుకు వచ్చారా.. కేటీఆర్ బహిరంగ లేఖకు బండి కౌంటర్
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ రాసిన బహిరంగ లేఖకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కల్వకుంట్ల అజయ్ రావు సామాజిక మాద్యమాలు, మీడియా ద్వారా మీరు రాసిన లేఖలోని అంశాలను తెలుసుకున్నానని, ఇన్నాళ్లకైనా సిరిసిల్ల నేతన్నల సమస్యలను గుర్తించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. కానీ, రాష్ట్రంలో పదేళ్లు మీరే అధికారంలో ఉన్నది మీరేనని, డిఫ్యాక్టో సీఎం కూడా మీరేనని ప్రకటనలో పేర్కొన్నారు. 15 ఏళ్లుగా సిరిసిల్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నది మీరెనని, అప్పటినుండి నేతన్నల ఆకలిచావులు కొనసాగుతూనే ఉన్నాయని, నేతన్నలు నాటి నుండి సంక్షోభంలోనే కొట్టుమిట్టాడుతున్నారని గుర్తు చేశారు. బతుకమ్మ ఆర్డర్లిచ్చి బకాయిలు కూడా చెల్లించకుండా పవర్ లూం సంస్థలు మూతపడేలా చేసింది మీరు కాదా అని, యారన్ కొనుగోలు పేరుతో దోపిడీకి తెరలేపింది, కరెంట్ సబ్సిడీలను బంద్ చేసి పవర్ లూం సంస్థల ఉసురు తీసింది మీరు కాదా అని ప్రశ్నించారు.

రాష్ట్రంలోని చేనేత కార్మికుల కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరంగల్ లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ను మీ హయాంలోనే ఏర్పాటు చేసిన సంగతి మర్చిపోయారా అని, ఆనాడు అధికారంలో ఉన్నది మీరే కదా... సిరిసిల్లలో మెగా టెక్స్ టైల్ పార్క్ ను ఎందుకు ఏర్పాటు చేయించలేకపోయారని, అప్పుడు మీ ప్రభుత్వం సహకరించి ఉంటే సిరిసిల్లలో మెగా పవర్ లూం పార్క్ ఎప్పుడో ఏర్పాటయ్యేదని నిలదీశారు. రాష్ట్ర పాలకుల వైఫల్యంవల్లే నేడు నేతన్నలు సంక్షోభంలో ఉన్నారని ఒప్పుకున్నందుకు సంతోషిస్తున్నానని, సిరిసిల్ల నేతన్నలు సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కేంద్ర మంత్రిగా, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా నా శాయశక్తులా ప్రయత్నిస్తున్నానని, అది తన బాధ్యత స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed