- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బండి సంజయ్ రైతుల పరామర్శకు వెళ్లావా.. సీఎం కేసీఆర్ ను తిట్టేందుకు వెళ్లావా: ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
దిశ, కరీంనగర్ టౌన్: జిల్లా పర్యటనలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఫైర్ అయ్యారు. కరీంనగర్ జిల్లాలో 9,500 మంది రైతులకు రూ.8.16కోట్ల నష్ట పరిహారం త్వరలో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. కరీంనగర్ మీసేవా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ.. చొప్పదండి నియోజకవర్గంలో గత వడగళ్లతో నష్టపోయిన 4వేల మంది రైతులు 3,500 ఎకరాలకు గాను రూ.3.50 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.
బండి సంజయ్ దమ్ముంటే... కేంద్ర ప్రభుత్వం తరఫున నష్ట పరిహారం ఎకరానికి రూ.20వేలు తీసుకురా అంటూ సవాల్ చేశారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలే లేవని, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రైతుల కోసం నిర్మించిన రైతు కల్లాల నిధులను రూ.150 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం వాపస్ తీసుకుందన్నారు, ఇందుకు బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత నెలలో వడగళ్లతో పంటలు ఇంకా కోతకు కూడా రాలేదన్నారు.
కానీ బండి సంజయ్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదనడం వారి మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. ఎరువులు, విత్తనాల ధరలు పెంచింది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. రైతులు దేశ రాజధాని ఢిల్లీలో మద్దతు ధరల గురించి ధర్నా చేస్తే లాఠీచార్జి, బాష్ప వాయువు గోలాలతో, రబ్బరు బుల్లెట్లతో రైతులకు రుచి చూపించిన ఘటన మోదీకే దక్కిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి, వడగళ్ల వానకు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులు ఆందోళన చెందవద్దని, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు.