'దళితులను అణగదొక్కుతున్న సర్కారుకు రసమయి మద్దతుగా ఉండడం భాదాకరం'

by S Gopi |
దళితులను అణగదొక్కుతున్న సర్కారుకు రసమయి మద్దతుగా ఉండడం భాదాకరం
X

దిశ, తిమ్మాపూర్: రాష్ట్ర ప్రభుత్వం వల్ల ప్రజలకు జరుగుతున్న బాధలు పట్టించుకోని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ని రాబోయే ఎన్నికల్లో తరిమికొడదామని సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు, బీజేపీ నాయకులు డా. దరువు ఎల్లన్న అన్నారు. ప్రజాగోస-బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని శక్తికేంద్రాల వారీగా జరుగుతున్నటువంటి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రేణికుంటలో మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా దరువు ఎల్లన్న, రాష్ట్ర బీజేపీ నాయకులు సొల్లు అజయ్ వర్మలు మాట్లాడుతూ.. పెన్షన్లు, రేషన్ కార్డులు లేక ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీజేపీ సారథ్యంలో ప్రతీ గ్రామంలో జరుగుతున్న కార్నర్ మీటింగ్ లకు వచ్చే ప్రజలందరూ ఎన్నో రకాల సమస్యలను తమతో చెప్పుకుంటున్నారని, ప్రజల సమస్యలు వినేందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్రలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నించుతున్నందుకే బీజేపీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ లు చేస్తున్నారని పేర్కొన్నారు.

గోశి గొంగడితో మాయమాటలు చెప్పి ఎమ్మెల్యేగా గెలిచి రూ. కోట్లు దండుకున్నాడని, ఆ డబ్బులతోనే గుండారంలో ఫార్మ్ హౌస్ నిర్మించుకున్నాడని ఆరోపించారు. నియోజకవర్గంలోని అన్నీ గ్రామాల్లో అర్హులకు డబుల్ బెడ్రూమ్ లు ఇచ్చామని అసెంబ్లీలో అబద్దాలు చెబుతున్నాడని మండిపడ్డారు. దళిత బంధు కూడా ఇస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెబుతున్నాడని, ప్రశ్నించేవారిపై పోలీస్ కేసులు పెట్టిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని అన్నారు. గ్రామాల్లోని మహిళకు నాణ్యత లేని చీరలు పంచుతూ కోట్ల రూపాయల స్కామ్ లకు పాల్పడుతున్నారని, దళితులకు ఎన్నో రకాల హామీలు ఇచ్చి మోసం చేస్తున్నారని అన్నారు. దళితులను అణగదొక్కుతున్న ప్రభుత్వానికి రసమయి మద్దతుగా ఉండడం చాలా భాదాకరమని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి, శక్తి కేంద్ర ఇంచార్జి గడ్డం అరుణ్, జిల్లా ఈసీ మెంబర్లు బూట్ల శ్రీనివాస్, మావురపు సంపత్, మండల ఉపాధ్యక్షులు తమ్మనివేణి రాజు యాదవ్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బోనాల మోహన్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి ఎర్రోజు లక్ష్మణ్, అధికార ప్రతినిధి తాళ్లపెల్లి రాజు గౌడ్, జిల్లా ఈసీ మెంబర్ కొయ్యడ శ్రీనివాస్ గౌడ్, బూత్ కమిటీ అధ్యక్షులు తమ్మనివేణి మహేష్, కాల్వ శ్రీనివాస్ యాదవ్, రేగూరి సుగుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed