ఉద్యమకారులను ఆదుకోవాలి.. రాజీవ్ రహదారి పై రాస్తారోకో..

by Sumithra |   ( Updated:2023-09-14 10:24:11.0  )
ఉద్యమకారులను ఆదుకోవాలి.. రాజీవ్ రహదారి పై రాస్తారోకో..
X

దిశ, పెద్దపల్లి : తెలంగాణ కోసం అనేక ఉద్యమాలు చేసి జీవితాలనే కోల్పోయిన ఉద్యమకారులను ఆదుకోవాలంటూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదురుగా రాజీవ్ రహదారి పై రాస్తారోకో చేశారు. ఇటీవల కరీంనగర్ రూరల్ మండలానికి చెందిన కుక్క మల్లన్న అనే ఉద్యమకారుడు ఉద్యమకాలంలో అనేక ఉద్యమాలు చేసి అప్పుల పాలై అప్పులను తీర్చలేక కరీంనగర్ అమరవీరుల స్తూపం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా బుధవారం కన్నుమూశాడు. మల్లన్న కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని మల్లన్న లాంటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎన్నో పేదకుటుంబాలు ఉన్నాయని వారందరినీ గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని ఫోరం నాయకులు డిమాండ్ చేశారు.

ఉద్యమకారుల సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని ఉద్యమకారుల కార్పోరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పై ఉందన్నారు. తమ బ్రతుకులు మారడం లేదని కలతచెంది ఆత్మహత్య చేసుకున్న మల్లన్న కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని ఈ సందర్భంగా ఉద్యమకారుల ఫోరం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం నాయకులు గుండేటి ఐలయ్య యాదవ్, బింగి రాజు, జ్యోతి రెడ్డి నూనె రాజేశం, ముంజంపల్లి లక్ష్మణ్, శ్రీనివాస్, మల్లేశం, సాగర్ రెడ్డి, రాములు, లక్ష్మణ్, రమేష్, రవి, లలిత, శంకర్, రవి, ఓదెలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story