మెట్ పల్లిలో కాంగ్రెస్ నాయకుల ధర్నా...

by Sumithra |
మెట్ పల్లిలో కాంగ్రెస్ నాయకుల ధర్నా...
X

దిశ, మెట్ పల్లి : రైతులకు మద్దతుగా పాసిగామా గ్రామానికి వెళ్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని గృహనిర్బంధం చేసిన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మెట్ పల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొమిరెడ్డి కరంచంద్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. దీంతో పట్టణంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ పాసిగామ గ్రామంలోని ప్రభుత్వం చేపట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీ వలన ప్రజలకు హాని జరుగుతుందని రైతులు భారీగా నష్టపోయే అవకాశం ఉందని వ్యతిరేకించి రైతులకు బాసటగా నిలిచేందుకు వెళ్తున్న జీవన్ రెడ్డిని గురువారం గృహనిర్బంధించటం సిగ్గుచేటని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మార్చుకోకుంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని అలాగే మెట్ పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ లో సైతం ఇథనాల్ ఫ్యాక్టరీని చేపడుతున్న ప్రభుత్వం పై కోర్టును ఆశ్రయించామని తెలిపారు. ఇలాంటి అక్రమ రెస్టులతో ప్రశ్నించే గొంతుకలను ఆపలేరని అప్రజాస్వామ్యంతో ప్రవహార్తిస్తున్న పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని మార్చుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొమిరెడ్డి విజయ్ ఆజాద్, కాంగ్రెస్ పార్టీ రైతు సంఘం నాయకులు అల్లూరి లింగారెడ్డి, కటకం గంగారెడ్డి, అంబటి హనుమాన్లు, న్యాయవాది సురభి, అశోక్, భీమయ్య, నాయకులు ఎండి రైసుద్దీన్, కాజా అజిమ్, ఖలీద్, బర్ల వంశీ, షేర్ భరత్, గణేష్, పొట్ట గోపి, గోనె ప్రసాద్ కంటి హరికుమార్, గడప విమల్, షరీఫ్, చిన్న, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story