దశాబ్ధి ఉత్సవాలను విజయవంతం చేయాలి : ఎస్పీ భాస్కర్

by Shiva |
దశాబ్ధి ఉత్సవాలను విజయవంతం చేయాలి : ఎస్పీ భాస్కర్
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుంచి 22 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన దశాబ్ధి ఉత్సవాలకు సంబంధించి జిల్లా పోలీస్ శాఖ తరఫున చేయవలసిన ఏర్పాట్లపై ఎస్పీ భాస్కర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మూడు వారాల పాటు సాగే వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లను చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.

అందులో భాగంగా జూన్ 4న సురక్షా దినోత్సవం పేరుతో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాన్ని, సమర్ధవంతమైన సేవలను వివరించే విధంగా కార్యక్రమాలు ఉండాలన్నారు. ఆదేవిధంగా పోలీసు శాఖలో జరిగిన సంస్కరణలను, వాటి విశిష్టతను సభల ద్వారా, కరపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నారు. పోలీసులు వాడుతున్న అధునాతన సాంకేతిక అంశాలు, పోలీస్ జాగిలాలు వివిధ నైపుణ్యాల గురించి ప్రదర్శన, పెట్రోలింగ్ కార్స్, బ్లూ కోల్ట్స్, వెహికిల్స్ తో ర్యాలీ నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

జూన్ 12వ జిల్లా లోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పోలీసు శాఖ నేతృత్వంలో యువకులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులతో ఉదయం 6 గంటలకు తెలంగాణ రన్ కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. క్రీడలు, యువజన సర్వీసుల శాఖ వారితో సమన్వయం చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీలు ప్రకాష్, రవీంద్రారెడ్డి, రవీంద్ర కుమార్, ఎస్బీ, డీసీఆర్, ఐటీ కోర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు రాజశేఖర్ రాజు, శ్రీనివాస్, సరిలాల్, నాగేశ్వరరావు, సీఐలు కోటేశ్వర్, ప్రవీణ్, లక్ష్మీనారాయణ, రమణమూర్తి ఆర్ఐలు వామన మూర్తి, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed