దశాబ్ధి ఉత్సవాలను వైభవంగా జరుపుకోవాలి : ఎమ్మెల్యే రసమయి బాలకిషన్..

by Shiva |
దశాబ్ధి ఉత్సవాలను వైభవంగా జరుపుకోవాలి : ఎమ్మెల్యే రసమయి బాలకిషన్..
X

దిశ, తిమ్మాపూర్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను మానకొండూర్ నియోజకవర్గంలో అత్యంత వైభవంగా జరుపుకోవాలని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీ.వీ.రామకృష్ణా రావు, నియోజకవర్గంలోని ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలతో, బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్న తరుణంలో జూన్ 2 నుంచి 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా మానకొండూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో దశాబ్ధి వేడుకలను అత్యంత వైభవంగా జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు.

మండల కేంద్రాల్లో ధూంధాం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అనేక ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. ఇందులో ప్రజలు భారీ సంఖ్యలో భాగస్వాములై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేష్, ఆయా మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed