- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రోడ్డు పై పొంచివున్న ప్రమాదం.. పట్టించుకోని అధికారులు..
దిశ, మానకొండూర్ : మానకొండూర్ నుండి జమ్మికుంటకు వెళ్ళే పోర్ లైన్ రోడ్డు పనులు మొదలు పెట్టి సుమారు నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు రోడ్డుపనులు ఇంక పూర్తి కాకపోవడమే కాకుండా కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. గతంలో రొడ్డు పనులు పూర్తిచేయాలని ఎన్నో సార్లు ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించారు. ఎక్కడ ధర్నా చేస్తే అక్కడ రోడ్డు వేశారు. కానీ కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పోర్ లైన్ రోడ్డు పనులు నడుస్తున్నాయి. అధికారులు మాత్రం చూచి చూడనట్టు వ్యావహరిస్తున్నారు. మానకొండూర్ నుండి పచ్చునూర్ వరకు అక్కడక్కడ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పోచంపల్లి గ్రామశివారులోని కాకతీయ కెనాల్ పై ఉన్న బ్రిడ్జిని ఇప్పటికీ పూర్తిచేయలేక ఎన్నో సార్లు ఇసుక లారీలు ఓవర్ లోడ్ తో ఉన్న లారీలు కేనాల్లో బోల్తా పడ్డ సంగతి తెలిసిందే. రొడ్డుపనుల్లో బాగంగా కెనాల్ పై ప్రమాదకరం గ ఉన్న కాంట్రాక్టర్ మాత్రం పట్టించుకోవడం లేదు ఎన్నో సార్లు కెనాల్ పై ఉన్న బ్రిడ్జి కూలిపోయిన తాత్కాలిక రిపేరు మాత్రమే చేసి అధికారులు చేతులు దులిపేసుకున్నారు.
బుదవారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం పోచంపల్లి గ్రామ సమీపంలోని కాకతీయ కెనాల్ బ్రిడ్జి పై దిగబడిన ఇసుక లారీ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిత్యం రాత్రింబవళ్ళు బస్సులు, ఇసుక లారీలు వందల సంఖ్యలో ఈ దారి వెంట వాహనాలు నడుస్తుంటాయి. కెనాల్ పై లారీ దిగబడటంతో రూటు మళ్లించిన వాహనదారులు. మానకొండూర్ నుండి వచ్చు బస్సులు శ్రీనివాస్ నగర్ మీదుగా వెల్ది,లక్ష్మిపూర్, పచ్చునూర్, ఊటూర్, వేగురుపల్లి, మీదుగా బస్సులు నడుస్తున్నాయి. రాకపోకలు అంతరాయం గ్రామాలు రాఘవపూర్, అన్నారం, లలితపూర్, రంగపేట, పోచంపల్లి, పచ్చనూర్ మీదుగా జమ్మికుంట వెల్లు బస్సులు రంగపేట నుండి కెళ్ళడ మద్ది కుంట, పచ్చునూర్ మీదుగా జమ్మికుంటకు వెళుతున్నాయి. కెనాల్ పై చెడిపోయిన లారీ వల్ల ప్రజలకు తీరని అంతరాయం ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.