- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో 40 వేల మంది లబ్ధిదారులకు దళిత బంధు: మంత్రి కేటీఆర్
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: రాష్ట్రంలో 40 వేల మంది లబ్ధిదారులకు దళిత బంధు అందజేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తంగళ్లపల్లి మండలంలోని గండిలచ్చ పేట గ్రామంలో దళిత బంధు పథకం ద్వారా ఏర్పాటు చేసిన పౌల్ట్రీ ఫాం ఆయన ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని 34 మంది దళిత బంధు లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 40 వేల మంది లబ్ధిదారులకు దళిత బంధు పథకాన్ని అదజేశామన్నారు. మరో రాష్ట్రం ఏదేనా.. దళిత బంధు పథకం పెట్టాలంటే ఖలేజా ఉండాలే. దళితుల దుస్థితి చూసి సీఎం కేసిఆర్ సాహసోపేతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. కంటి వెలుగు లాంటి అద్భుత పథకం మరెక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. మనసున్న సీఎం కేసీఆర్ కాబట్టే ఇలాంటి కార్యక్రమాలను చేపట్టి దృష్టి లోపాలను సవరిస్తున్నారని అన్నారు.
రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో వైకుంఠ ధామం, నర్సరీ, డంపింగ్ యార్డ్ లను ఏర్పాటు చేశామన్నారు. దేశంలోనే అత్యుత్తమ, ఆదర్శ గ్రామాల కు నెలవు తెలంగాణనేని అన్నారు. ఇందుకు కేంద్రం ప్రకటించిన అవార్డులే సాక్ష్యాలని ఆయన పేర్కొన్నారు. ఒక్క గండిలచ్చపేట గ్రామంలో రూ.6. 89 కోట్ల రూపాయలను అభివృద్ధి, సంక్షేమం కోసం వెచ్చించామని ఆయన తెలిపారు.
Also Read..